ఒకే చితిపై నాలుగు కరోనా మృతదేహాలు దహనం

  • Publish Date - July 30, 2020 / 04:14 PM IST

కరోనా మృతదేహాలు ఖననం చేయటంలోనూ..దహనం చేయటంలోనూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి. చనిపోయినవారిపై గౌరవం లేకుండా ఇటువంటి అంత్యక్రియలు ఏమిటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో వరంగల్ జిల్లాలో మరో ఘటన జరిగింది. ఒకే చితిపై నాలుగు మృతదేహాలు దహనంచేయటంపై పాటు పలువురు మండిపడుతున్నారు. కాలం తీరకుండానే కరోనాతో చనిపోయినవారిక ఇచ్చే గౌరవం ఇదేనా?సంప్రదాయాలను పక్కనపెట్టి అమానవీయంగా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు.

ఒకే చితిపై నాలుగు మృతదేహాలను దహనం చేసిన ఘటనపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి మాట్లాడుతూ..కట్టెలు కొరతగా ఉన్నాయి. అలే సిబ్బంది కొరత వల్ల ఒకే చితిపై దహనం చేయాల్సి వస్తోందని తెలిపారు. గుంపులుగా దహనాలు చేయకపోతే ఆలస్యమై శవాలు డీ కంపోజ్ అవుతాయని.. అందుకే సామూహిక దహనాలు చేయాల్సి వస్తోందని పమేలా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు