Cm Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వర ప్రాజెక్ట్ కు క్యాబినెట్ అనుమతి లేదన్నారు. 30వ తేదీలోపు కాళేశ్వరం కమిషన్ కు పూర్తి వివరాలు ఇస్తామన్నారు. కేసీఆర్ పాపంతోనే గోదావరి నీళ్లు వాడుకోలేకపోయామని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ధనదాహం తోనే తెలంగాణకు శాపంగా మారిందన్నారు. నీళ్లు వినియోగించుకోకుండా ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్.. తెలంగాణకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు సీఎం రేవంత్.
”కాళేశ్వరంకు మేడిగడ్డ గుండెకాయ. గుండెకాయ పోతే ఎలా బతుకుతారు హరీశ్. జూరాల నుండి కృష్ణ నీటిని తీసుకోకుండా కేసీఆర్ కావాలని చేశారు. పోతిరెడ్డిపాడు కేసీఆర్ పాపం కాదా? చంద్రబాబు ముచ్చుమర్రి కడుతుంటే మూతి ముడుచుకున్నది కేసీఆర్ కాదా? కేసీఆర్ చెప్పిన మినిట్స్ ను రేపు చంద్రబాబు తెస్తారు. అధికారం నీకు నీళ్లు నాకు అన్నట్లు చంద్రబాబుబాబు, ప్రధాని మోదీ ఉన్నారు. అంబిక దర్బార్ బత్తిగా.. గోదావరి బనకచర్ల మారింది.
కిషన్ రెడ్డి .. మాతో కలిసి రావాలి. కేసీఆర్ మాటలు విని.. కిషన్ రెడ్డి ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తాం. కిషన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. మీటింగ్ కు రాని వ్యక్తి.. ఢిల్లీలో జలశక్తి మంత్రిని ఎలా కలుస్తారు? కేసీఆర్ అడ్డుకోమన్నందుకే కిషన్ రెడ్డి మీటింగ్ కు రాలేదు. కిషన్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించింది. హరీశ్ అసూయకు మందు లేదు. కేసీఆర్ కట్టింది, కూలింది కాళేశ్వరం ఒక్కటే” అని విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.