Banakacherla Project: బనకచర్లపై న్యాయపోరాటం.. ఆ రోజు జగన్‌కు కేసీఆర్ ఓకే చెప్పడం వల్లే సమస్య.. ఆల్ పార్టీ మీటింగ్‌లో సీఎం రేవంత్

ఎవరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలని అనుకోవడం లేదన్నారు. అందరి సహకారంతో బనకచర్లపై పోరాటం చేస్తామన్నారు.

Banakacherla Project: బనకచర్లపై న్యాయపోరాటం.. ఆ రోజు జగన్‌కు కేసీఆర్ ఓకే చెప్పడం వల్లే సమస్య.. ఆల్ పార్టీ మీటింగ్‌లో సీఎం రేవంత్

Updated On : June 18, 2025 / 7:30 PM IST

Banakacherla Project: ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ పై ఆల్ పార్టీ మీటింగ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం తీరుతోనే నీటి వివాదం జఠిలమైందన్నారు. సముద్రంలో కలిసే నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని కేసీఆర్ ప్రతిపాదించారని సీఎం రేవంత్ తెలిపారు. ఆరోజు జగన్ కు కేసీఆర్ ఓకే చెప్పడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు.

బనకచర్లపై రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ వ్యవహారంలో ఎవరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలని అనుకోవడం లేదన్నారు. అందరి సహకారంతో బనకచర్లపై పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బనకచర్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కాగా, బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు చేయనుంది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి పాటిల్ ను కలవనున్నారు.

”మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలి. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం.

Also Read: సీఎం రేవంత్‌ను కలవడంలో ఆంతర్యమేంటి? కవితతో ఎందుకు భేటీ అయినట్లు? చర్చనీయాంశంగా కేంద్రమంత్రి తీరు..

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 21-9-2016 రోజున అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారు. ఆ సమావేశంలో హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. మళ్లీ 13 ఆగస్టు 2019 లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కేసీఆర్, జగన్ ప్రగతి భవన్ లో నాలుగుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటల రాజేందర్, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ మీటింగ్ మినిట్స్ ను రెఫరెన్స్ గా చూపి తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్.

ఇందుకు సమబంధించి అఫీషియల్ డాక్యుమెంట్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి అపాయింట్ మెంట్ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తాం. పొలిటికల్ ఫైట్ లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్ చేద్దాం. ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

బనకచర్ల ప్రాజెక్ట్ పై సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసిందని ఆరోపించింది. రాజకీయ కోణంలోనే సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని సమావేశం నుంచి వెళ్లిపోయారు బీఆర్ఎస్ ఎంపీలు.