Revanth Reddy Arrest : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ‘చలో రాజ్‌భవన్’కు పిలుపునించింది కాంగ్రెస్ పార్టీ.. పార్టీ పిలుపుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు హైదరాబాద్ పయనమయ్యారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని హౌస్ అరెస్టులు చేశారు.
ఇక ఈ నేపథ్యంలోనే ఇందిరా పార్క్ వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద జరిగిన సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కార్యకర్తలతో కలిసి రాజ్ భవన్ వైపు పాదయాత్రగా బయలుదేరారు.. ఇదే సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అక్కడినుంచి తీసుకెళ్లారు.
రేవంత్ ను అరెస్ట్ చేసే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రేవంత్ అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు రేవంత్ తీసుకెళ్తున్న వాహనం వెంట వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి డీసీఎంలో స్టేషన్ కు తరలించారు.