ఎప్పుడూ రొమాన్స్ గురించే కలలు కంటూ ఉంటే… దానర్ధమేంటి?

  • Publish Date - July 27, 2020 / 04:37 PM IST

మీకు నిద్రలో ఎలాంటి కలలు ఎక్కువగా వస్తుంటాయి. రొమాన్స్ చేస్తున్నట్టుగా అదేపనిగా కలలు కనేస్తున్నారా? అయితే మీరంతో అదృష్టవంతులు.. రొమాన్స్ డ్రీమ్ ఒక అద్భుతమైన అనుభవమని అంటోంది ఓ అధ్యయనం.. అసలు మనుషులకు కలలు ఎందుకు వస్తాయి.. అనేదానికి చాలా శాస్త్రీయ సిద్ధాంతాలు ఉన్నాయని అంటున్నారు.

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. మనిషి మెదడులో భ్రమలు కలిగించేలా ఎందుకు ప్రేరేపిస్తుందో శాస్త్రీయ సిద్ధాంతలను వివరించారు. ఇలాంటి డ్రీమ్స్.. రాత్రికి సగటున నాలుగు నుండి ఆరు సార్లు జరుగుతాయని గుర్తించారు. మన నిద్రించే REM (rapid eye movement) సమయంలో చాలా శక్తివంతంగా ఉంటాయని అంటున్నారు.


కలల విషయాల విషయానికొస్తే.. కొంచెం క్లిష్టంగా ఉంటుందని సైకాలిజిస్ట్ Steve Richards చెబుతున్నారు. కలలను విశ్లేషణ చేయడంలో ఈయనకు 40 సంవత్సరాల అనుభవం ఉందని అంటున్నారు. నిద్రలో వచ్చే కలలు మనం చూసే వాటితో పోలి ఉంటాయని ఎలా అనిపిస్తుందో అవే దృశ్యాలు కనిపిస్తాయని అన్నారు. మన కలలు ప్రధానంగా లైంగిక స్వభావం కలిగి ఉంటే దాని అర్థం ఏమిటి? శారీరక సాన్నిహిత్యం లేకపోవడం వల్ల ఇలాంటి కలలు ఎక్కువగా వస్తుంటాయా? ఏమైనా లోతైన అర్ధం ఉందా? అయితేతప్పక తెలుసుకోవాల్సిందే..


శృంగారం గురించి ఎందుకు కలలు వస్తాయి.. వాటి అర్థం ఏంటి?
అంటే.. మన ఆలోచనలే కలల రూపంలో వస్తాయి. శృంగారంపై ఎక్కువగా ఆలోచనలు ఉంటే.. వారిలో ఎక్కువ శాతం శృంగారానికి సంబంధించి కలలే ఎక్కువగా వస్తుంటాయి. రోజులో ఏదైనా విషయంపై ఎక్కువగా ఆలోచిస్తే.. అదే రోజు రాత్రిలో కల రూపంలో కనిపించవచ్చు.

సింపుల్ గా చెప్పాలంటే.. మీ సహోద్యోగితో నిద్రపోతు న్నారనుకుంటే.. మీరు వారితో రొమాన్స్ చేస్తున్నట్టు కలలు కనే అవకాశం ఉంది. మన కలలలో ఏమి జరుగుతుందో మనం ఊహించలేం.. ఎందుకంటే కొన్ని కలలు నిద్రలో ఉన్నంతసేపు గుర్తుంటాయి.. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత రిచిపోతుంటారు. కొన్ని కలలు మాత్రమే బాగా గుర్తుండిపోతాయి.


మన జీవితంలో అనుభవించిన పలు అంశాలపై తరచుగా కలలు వస్తుంటాయని సైకాలిజిస్టులు చెబుతున్నారు. మన జీవితాల అనుభవాల ద్వారా కలిసి సమూహంగా ఉన్న ఆలోచనలు భావోద్వేగాలుగా గుర్తించారు. ఆందోళన, నిరాశ లేదా న్యూరోసెస్ వంటివి కారణంగా కూడా కలలు ఎక్కువగా వస్తుంటాయని చెబుతున్నారు.



కొంతమది అందమైన యువతితో లైంగిక సంబంధం గురించి ఎక్కువగా కలలు కంటారు. మరికొంతమంది తమను ద్వేషించే వారితోనూ అదే శృంగారపు కలలు కంటారు. దీని అర్థం మీరు ద్విలింగ లేదా స్వలింగ సంపర్కులా లేదా మీ మాజీతో ఇప్పటికీ ప్రేమలో ఉన్నారా లేదా రహస్య ఫెటీషెస్ కలిగి ఉన్నారా? అనేది చెప్పవచ్చు. లైంగికత అనేది జీవితంలో ఒక సాధారణ భాగమన్నారు స్టీవ్.. శృంగారపు కలలు లైంగికత, ప్రాధాన్యతలు లేదా నైతికతతో పెద్దగా సంబంధం కలిగి ఉండవు. కానీ మన ప్రస్తుత లైంగిక జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి.

కొన్ని అధ్యయనాలు కూడా మన కలలను ప్రభావితం చేస్తాయని సూచిస్తున్నాయి. మీరు రోజంతా శృంగార పుస్తకాలు చదవడం లేదా పోర్న్ చూడటం గడిపినట్లయితే మీ నిద్రలో అదే శృంగారపు కలలు వస్తాయి. మనం కనే కలలను బట్టి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చునని ఇతర పరిశోధనలు చెబుతున్నాయి.


మనస్సు, శరీరం ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి. ఆరోగ్యకరమైన అనుభూతి పొందాలంటే ముందుగా మీ మనస్సు, శరీరం మాట్లాడుకోవాలి.. అప్పుడే మీలోని భావాలు, కోరికలు, ఆలోచనలన్నీ కలల రూపంలో వచ్చి కవ్విస్తుంటాయి.



ట్రెండింగ్ వార్తలు