Meera Jasmine : తెలుగులో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్న హీరోయిన్..

2014లో వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది మీరా జాస్మిన్. ఆ తర్వాత కొన్నాళ్ళు భర్తతో దుబాయ్ లో ఉండి అతనితో గొడవలు రావడంతో విడిపోయింది. మలయాళం సినిమాలతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ సినిమాలతో.............

Meera Jasmine :  ఇటీవల ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసి కెరీర్ కి గ్యాప్ ఇచ్చిన వాళ్ళు మల్లి ఏదో ఒకరకంగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కొంతమంది సీనియర్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ లో, కొంతమంది టీవీ షోలతో మళ్ళీ తెరపై కనిపిస్తున్నారు. అలాగే ఒకప్పుడు తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, రారాజు, గుడుంబా శంకర్, గోరింటాకు.. లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడు మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

2014లో వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది మీరా జాస్మిన్. ఆ తర్వాత కొన్నాళ్ళు భర్తతో దుబాయ్ లో ఉండి అతనితో గొడవలు రావడంతో విడిపోయింది. మలయాళం సినిమాలతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా భర్త నుంచి విడిపోయాక మళ్ళీ సినీ పరిశ్రమవైపు వచ్చింది.

Martin : ధృవ సర్జా హీరోగా కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా.. KGF రేంజ్ లో పోస్టర్..

సోషల్ మీడియాలో కూడా ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్ళ వయసులో కూడా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది మీరా. ఆల్రెడీ 2022లో ఓ మలయాళం సినిమాతో సినీ పరిశ్రమకి కంబ్యాక్ ఇచ్చిన మీరా ఇప్పుడు త్వరలో ఓ సినిమాతో తెలుగులో కూడా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది. విమానం అనే సినిమాతో మీరా జాస్మిన్ తెలుగులో కంబ్యాక్ ఇవ్వబోతుంది. తాజాగా నేడు మీరా జాస్మిన్ పుట్టిన రోజు కావడంతో కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న విమానం సినిమాలో మీరా జాస్మిన్ నటించబోతున్నట్టు ప్రకటించారు. దీంతో మీరా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు