ఆవు మూత్రం తాగితే కరోనా రానేరాదు..ఈ విషయం గాడిదలకు ఎప్పటికీ అర్థం కాదు

  • Publish Date - July 20, 2020 / 01:16 PM IST

ఆవు మూత్రం తాగితే కరోనా వైరస్ రమ్మన్నా రాదు అంటూ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. అంతేకాదు మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆవు మూత్రం తాగాలని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సూచించారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో రోగనిరోధక శక్తని పెంచడానికి గోమూత్రం తాగాలని దుర్గాపూర్ నగరంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ దిలీప్ ఘోష్ ప్రజలకు సూచించారు.

నేను ఆవుల గురించి మాట్లాడితే చాలా మందికి ఏదో విపరీతంగా అనిపిస్తుంటుంది. అటువంటివారు గాడిదలు..ఆవు విలువను ఆ గాడిదలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది భారతదేశం, శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్రమైనభూమి … ఇక్కడ ఆవులను పూజిస్తాం. ఆరాధిస్తాం..సంరక్షిస్తాం.

ఆవు ఒక జంతువు మాత్రమే కాదు అది ఆరోగ్యప్రదాయని..ఆరోగ్యంగా ఉండటానికి మాకు ఆవు మూత్రం ఉంది.లాక్డౌన్ ఆంక్షలు సడలించిన సందర్భంగా రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద అతి పెద్ద లైన్లను గురించి దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మద్యం తాగే వారు, ఆవు విలువను ఎలా అర్థం చేసుకుంటారంటూ ప్రశ్నించారు.

కాగా..దిలీప్ ఘోష్ ఆవులపై గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 2019 నవంబరులో ఘోష్ ఆవు పాలలో బంగారం ఉందని వ్యాఖ్యానించడం పలు విమర్శలకు దారి తీసింది.దీనిపై కొందరు కౌంటర్ ఓ వ్యక్తి బ్యాంకు వద్దకు ఓ ఆవును తోలుకు వచ్చి..‘‘ఇది నా ఆవు..దీని పాలల్లో బంగారం ఉంటుందని ఓ నేత చెప్పారు. దయచేసిన నా ఆవును మీ బ్యాంకులో తాకట్టు పెట్టుకుని నాకు డబ్బులివ్వండి అని అడిగాడు.

దిలీప్ ఘోష్ ఆవు గురించి చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినా ఆయన మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా సంచలన వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆవు మూత్రం తాగితే కరోనా రాదు అంటూ వ్యాఖ్యనించటం విమర్శలకు దారి తీస్తోంది.

ట్రెండింగ్ వార్తలు