Rains In Telangana : రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Rains In Telangana :  తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిమీ నుండి 5.1 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వారు వివరించారు.

ఈరోజు ఆవర్తనం దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య & పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతూ ఉందని తెలిపారు.

ఈ రోజు రుతుపవన ద్రోణి జైసాల్మర్, కోట,జబల్‌పూర్, పెండ్రా రోడ్, కళింగపట్నం మీదుగా నైరుతి & దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఆవర్తనం మీదగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.

మరోవైపు ఏపీలో రాగల నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం నుంచి వాయువ్య దిశలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు