Hot Summer : వామ్మో.. అగ్నిగుండంలా తెలంగాణ, రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదు

గతేడాదితో పోల్చుకుంటే ఈరోజు సాధారణం కంటే 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Hot Summer : తెలంగాణలో ఇవాళ (ఏప్రిల్ 28) రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ములుగు జిల్లా మంగపేటలో 45.2, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాలో 44.8 డిగ్రీలు, 11 జిల్లాలో 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈరోజు సాధారణం కంటే 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగాలులు.. జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు సెగలు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయాందోళనకు గురవుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ చివరి వారం నుంచే టెంపరేచర్లు పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఇక మే నెలలో ఎలా ఉంటుందో అని అంతా హడలిపోతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులే ఎండల తీవ్రతకు కారణం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Also Read : వామ్మో ఇవేం ఎండలు..! నిప్పుల కుంపటిలా తెలంగాణ, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

ట్రెండింగ్ వార్తలు