Black Thrips Pest : మామిడి, బొప్పాయితో పాటు ఇతర ఉద్యానవన తోటల్లో నలుపు రంగు తామర పురుగుల నియంత్రణ!

వీటి నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేయుట ద్వారా పురుగు కోశస్థ దశలను నివారించవచ్చు. దీంతోపాటుగా పంట మార్పిడి చేపట్టుట వలన పురుగు ఉదృతి కొంతవరకు నివారించవచ్చు. పచ్చిరొట్ట పంటలను సాగుచేసి పొలంలో కలియదున్నాలి, చివరిదుక్కిలో ఎకరాకు 200 కిలోల వేప చెక్కను వేయాలి.

Black Thrips Pest : నలుపు రంగు తామర పురుగు ఉద్యానవన పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మునగ, టమాట, చిక్కుడు, దొండ, దోస, కాకర, పుచ్చ అపరాలు, పత్తి, బంతి మొదలగు పంటలలో నష్టం కలిగించడమే కాకుండా పిచ్చిదోస, తోటకూర, వయ్యారిభామ, కామంచి, గడ్డి చామంతి మరియు గడ్డిజాతి పంటలలో ఆశ్రయం కల్పించుకొని పంటలకు నష్టం కలిగిస్తుంది.

ఈ తామర పురుగులు ఆకుల మీద ఎక్కువ సంఖ్యలో చేరి పత్రహరితం గీకి వేయడం మరియు రసం పీల్చడం ద్వారా కణజాలం దెబ్బతినడం వలన ఆకు పరిమాణం తగ్గి ఆకారం మారిపోతుంది మరియు ఆకులు మాడిపోయినట్లుంటాయి. ఒక పువ్వు పైన దాదాపుగా 20-25 సంఖ్యలో ఉండి పూరెక్కల నుండి, ఆకర్షక పత్రాల నుండి మరియు కేసరాల నుండి రసం పీల్చడం వల్ల పూత ఎండిపోయి కాయలు ఏర్పడకుండా చేస్తాయి.

పిల్ల పురుగులు కాయ తయారీ దశలలో ఎక్కువగా లేత కాయల మీద ఆశించి రసం పీల్చడం ద్వారా కాయలు గట్టిగా, గిడసబారి ఇటుకరాయి రంగులోకి మారిపోతాయి. పూతను ఆశించిన పురుగులు పుప్పొడిని తినివేయడం మరియు పూత భాగాలను గీకి వేయడం ద్వారా పూత కణజాలం దెబ్బతిని గోధుమ రంగు చారలు ఏర్పడతాయి.

వీటి నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేయుట ద్వారా పురుగు కోశస్థ దశలను నివారించవచ్చు. దీంతోపాటుగా పంట మార్పిడి చేపట్టుట వలన పురుగు ఉదృతి కొంతవరకు నివారించవచ్చు. పచ్చిరొట్ట పంటలను సాగుచేసి పొలంలో కలియదున్నాలి, చివరిదుక్కిలో ఎకరాకు 200 కిలోల వేప చెక్కను వేయాలి. అధికంగా నత్రజని ఎరువుల వాడకం తగ్గించి, సిఫార్సు చేసిన మోతాదులో అనగా 120:24:48 కేజీల నత్రజని, భాస్వర%శీ% మరియు పొటాష్‌ ఎరువులను దఫాల వారిగా వేయాలి.

పంట చుట్టూ 2-3 వరసలలో రక్షక పంటగా జొన్న లేదా మొక్కజొన్న పంటలను వేసుకోవాలి. పొలంచుట్టూ మరియు గట్లపై కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. 5 శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె 10,000 పి.పి.యం 1.0 మి.లీ లేదా 15,00 పి.పి.యం 2.0 మి.లీ లేదా కానుగ నూనె 2.0 మి.లీ లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేసుకోవాలి.

పురుగుల నివారణకు ఫిప్రోనిల్‌ 80 శాతం డబ్ల్యూ.జి 0.2గ్రా లేదా సైయాన్‌ ట్రానిలిప్రోల్‌ 10.26 శాతం ఓ.డి 1.2 మి.లీ లేదా డైమిధోయేట్‌ 30 శాతం ఈ.సి 2.0 మి.లీ లేదా ధయామిధాక్సమ్‌ 25 శాతం డబ్ల్యూ.జి 0.8 గ్రా లేదా స్పైనటోరమ్‌ 11.7 శాతం ఎస్‌.సి 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పిచికారి సమయంలో మొక్క అన్ని బాగాలు తడిచే విధముగా పిచికారి చేసుకోవాలి.

పురుగు ఉదృతి అధికముగా ఉన్నప్పుడు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అదేవిధముగా పంటలో పోషక లోపాలు తలెత్తకుండా ఫైపాటుగా పోషకాలను అందించాలి. పురుగు మందుల మీద మాత్రమే ఆధార పడకుండా తప్పనిసరిగా వేపనూనె, కానుగ నూనెను కూడా పంట మీద పిచికారి చేయాలి.

ట్రెండింగ్ వార్తలు