Village Volunteers : చిత్తూరు జిల్లాలో 74మంది వాలంటీర్ల రాజీనామా, సంచలన ఆరోపణలు

చిత్తూరు జిల్లాలో 74 మంది గ్రామ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా సంచలనం రేపింది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తు

Village Volunteers : చిత్తూరు జిల్లాలో 74 మంది గ్రామ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా సంచలనం రేపింది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల వాలంటీర్లు ఆరోపించారు. ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. అంతేకాదు సామూహిక రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. వాలంటీర్లను వేధిస్తున్న ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార నేతలు వేధింపులు మానుకోవాలన్నారు. గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు.

JioPhone Next : రూ.500కే జియో స్మార్ట్ ఫోన్..?

ఈవో తమను అసభ్య పదజాలంతో దూషించారని, తమను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు, మనోవేదనకు గురి చేశారని వారు వాపోయారు. తాము తమ పరిధిలో ప్రశాంతంగా పని చేసుకోలేకపోతున్నామని, అధికార పార్టీ నేతలు కూడా తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ఎంత పని చేసినా ఏదో ఒకటి అని అవమానిస్తున్నారని చెప్పారు.

దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై స్థానిక రాజకీయ నేతలు పెత్తనాలు మానుకోవాలని.. అలాగే వారిని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు. కాగా, వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

WhatsApp Tricks: వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ ఇలా చదవొచ్చు!

అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలను సీఎం జగన్ మానస పుత్రికలుగా భావిస్తారు. దేశం మొత్తం మీద ఈ వ్యవస్థలు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటికే చేరవేసేందుకు సీఎం జగన్ ఈ వ్యవస్థలు తీసుకొచ్చారు. ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండే విధంగా సులభంగా, వేగంగా పనులు అయ్యేందుకు ఈ వ్యవస్థలకు సీఎం జగన్ రూపకల్పన చేశారు. వాలంటీర్ల ద్వారా అనేక సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు