AP High court : చంద్రబాబుకు షాకిచ్చిన హైకోర్టు, ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన మూడు పిటీషన్లను డిస్మిస్ చేసింది.

Chandrababu Anticipatory Bail Dismissed

AP High court chandrababu bail petitions : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన మూడు పిటిషన్లను డిస్మిస్ చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, అంగళ్లు ఘటన, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మూడు కేసుల్లోను ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు మూడింటిని కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.

కాగా ఇన్నర్ రింగు రోడ్డు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు A1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసులో A25గా ఉన్నారు. ఈ మూడింటిని ధర్మాసనం కొట్టివేటయంతో చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. అలాగే బెయిల్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు, టీడీపీ నేతలకు ఈ పరిణామం షాకింగ్ విషయమనే చెప్పాలి. బెయిల్ వస్తుందనే ఆశ నిరశగా మిగిలిపోయింది.

కాగా, ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైనా మరోపక్క సుప్రీంకోర్టులో రిలీఫ్ వస్తే ఆ తరువాత కస్టడీ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు మధ్యాహ్నాం విచారణ జరుగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసం విచారణ జరుపనుంది. అక్టోబర్ 3న ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం దీనికి సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలను తమకు సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించిన విషయం తెలిసిందే.

Also Read: బండారు సత్యనారాయణను వదిలిపెట్టను, సుప్రీంకోర్టు వరకైనా వెళ్తా- మంత్రి రోజా

దీంతో ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించింది. వీటిని పరిశీలించి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. దీంతో సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు రానుంది అనే విషయం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్కడ చంద్రబాబుకు రిలీఫ్ వస్తే కస్టడీ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు