Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై చర్చ

విద్యుత్ పద్దులపై కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది.

Telangana Assembly Session 2024

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజులో భాగంగా ప్రశోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చ జరపనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు శాసన సభ ప్రారంభం కానుంది. 19 పద్దులపై చర్చించనున్నారు. ఆర్థిక నిర్వహణ, ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్ పై చర్చ జరుపుతారు. మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై చర్చ ఉంటుంది.

పరిశ్రమల శాఖ పద్దులపై కూడా చర్చిస్తారు. ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా, మెడికల్, హెల్త్ పై చర్చ జరుపుతారు. 19 పద్దులపై చర్చించిన తర్వాత అమోదం తెలపనుంది శాసనసభ. ముఖ్యమంత్రి వద్దనే మున్సిపల్, విద్యాశాఖ, హోం శాఖ ఉండడంతో సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది.

విద్యుత్ పద్దులపై కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది. మోటర్లకు మీటర్లు పెట్టేందుకు 2017లోనే ఉదయ్ స్కీంలో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. తమ హయాంలో మోటార్లకు మీటర్లు పెట్టలేదని బీఆర్ఎస్ చెబుతోంది.

Also Read: టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత సూర్య‌నారాయ‌ణ బాబు కన్నుమూత

ట్రెండింగ్ వార్తలు