Kamala Harris: ఎన్నికల రేసు అంచనాలను మార్చేసిన కమలా హారిస్.. గేమ్‌ఛేంజర్‌గా లేడీ పొలిటికల్ స్టార్

ట్రంప్‌తో పోలిస్తే ఆమె కాంట్రవర్సీ క్యాండిడేట్‌ కూడా కాదు. కొన్ని ఇష్యూస్‌లో..

ఇప్పుడు ఆమె అవసరం డెమొక్రాట్లకే కాదు.. అమెరికన్లకు కూడా ముఖ్యం. ట్రంప్‌కు ప్రత్యామ్నాయమే లేదు. అతనే దిక్కనుకున్న సమయంలో అటు అగ్రరాజ్య ప్రజల్లో..ఇటు డెమొక్రాట్లలో భరోసా కల్పించి..నిలిచి గెలిచేందుకు సిద్దమయ్యారు కమలా హారిస్.. తానే ఒక ఆయుధమై.. తానే ఓ నినాదమై యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల రేసును నడిపిస్తున్నారు.

ఇప్పటికీ ఆమె ఏ స్టేట్‌లో ప్రచారం చేయడం లేదు. తానే అధ్యక్ష అభ్యర్థిని అని కూడా నిన్నటి మొన్నటి వరకు కూడా చెప్పుకోలేదు. కానీ ఆమె సెంట్రిక్‌గానే అగ్రరాజ్యం పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇదే ఇప్పుడు ట్రంప్‌కు నచ్చడం లేదు. బైడెన్‌తో ఓపెన్ డిబేట్‌ అంటే తొడగొట్టిన ట్రంప్‌.. హారిస్‌తో డిబేట్‌ అంటే రుకో జర సబర్ కరో అంటున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే వరకు కమలాతో డిబేట్‌కు వెళ్లనని చెప్తున్నారు.

అగ్రరాజ్యం పాలిటిక్స్‌లో లేడీ పొలిటికల్ సూపర్‌ స్టార్‌గా ఉన్న కమలా హారిస్‌కు బ్యాడ్‌ నేమ్ ఏం లేదు. ట్రంప్‌తో పోలిస్తే ఆమె కాంట్రవర్సీ క్యాండిడేట్‌ కూడా కాదు. కొన్ని ఇష్యూస్‌లో ఆమె స్పందించిన తీరును తప్పుబట్టడమే తప్ప.. ప్రజల పట్ల, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో దూకుడుగా, దరుసుగా ప్రవర్తించలేదు కమలా హారిస్.

వైస్‌ ప్రెసిడెంట్‌గా జోబైడైన్‌కు అండదండగా ఉండి.. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆమెది కీలక పాత్ర. అయితే మీడియాలో కమలా హారిస్‌కు పెద్దగా ఎక్స్‌పోజర్ లేదు. అదే ఆమెకు మైనస్‌ తప్ప పెద్దగా వ్యతిరేక అంశాలేం లేవు. ఇప్పుడు అధ్యక్ష రేసులోకి వచ్చాక కమలా హారిస్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా.. టాక్ ఆఫ్‌ ది అమెరికన్ పాలిటిక్స్‌గా మారిపోయారు.

అందరి నుంచీ మద్దతు
కమలా హారిసే డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి. అగ్రనేతల నుంచి పార్టీ ప్రతినిధుల వరకు అందరూ ఆమెకు మద్దతు పలికారు. అధికారికంగా ప్రకటించమే ఆలస్యం ఉంది. ఆగస్ట్‌లో మూడ్రోజుల పాటు జరగనున్న డెమొక్రాట్ల సమావేశంలో కమలా హారిస్‌ను ప్రెసిడెంట్‌గా క్యాండిడేట్‌గా అనౌన్స్ చేయనున్నారు. అప్పటి నుంచి ఆమె అసలైన పోరు మొదలుపెట్టే అవకాశం ఉంది.

ఆగస్ట్‌ 22. కమలా హారిస్‌ లైఫ్‌లో స్పెషల్ డే. డగ్లస్ ఎం హాఫ్‌తో ఆమె పెండ్లి జరిగిన రోజు. డెమొక్రాట్ల సమావేశాలు ముగిసేది ఆ రోజే.. ఆమెను పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అదే రోజు ప్రకటించి వెడ్డింగ్‌ యానవర్సరీ గిఫ్ట్‌ ఇచ్చేందుకు డెమొక్రాట్లు రెఢీ అయ్యారు..

బైడెన్‌ రేసులో ఉంటే ట్రంప్‌ను తిట్టడం.. బైడెన్‌ వయసును ట్రంప్ టార్గెట్‌ చేయడం జరిగింది.. కానీ మానవ హక్కుల పోరాట నేపథ్యంతో వచ్చిన కమలా హారిస్‌ ప్రైమరీ మీటింగ్స్‌లోనే ప్రజల మెప్పు పొందేలా మాట్లాడుతున్నారు. అమెరికాను సకల జాతుల జీవన క్షేత్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తానన్న ఆమె స్టేట్‌మెంట్‌తో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

సర్వేల్లో మద్దతు
ట్రంప్‌ మద్దతుదారులకు కమలా హారిస్ ప్రకటన నచ్చకపోవచ్చు. కానీ ఆ ఒక్క మాటతో అమెరికన్లు, ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఆమెకు సర్వేల్లో మద్దతు పెరుగుతూ వస్తోన్నట్లు కనిపిస్తోంది.

రాజకీయాలు ఎప్పుడూ ఒక్కతీరుగా ఉండవని.. మారుతూ ఉంటాయని వింటుంటాం. అది అమెరికా పాలిటిక్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బైడెన్ రేసులో ఉన్నప్పుడు సంక్షోభంలో ఉన్న డెమొక్రాట్ల భవిష్యత్‌ను గెలుపు దిశగా నడిపిస్తున్నారు హారిస్. ట్రంప్‌ను ఓడించి ఆమె అధ్యక్షురాలైతే వేరే లెవల్‌ ఉండబోతోంది. డెమొక్రటిక్ పార్టీలో తిరుగులేని నాయకురాలిగా.. భారత మూలాలన్న వ్యక్తి అగ్రరాజ్యాన్ని ఏలుతున్న రికార్డును ఆమె సొంతం చేసుకోనున్నారు.

Also Read : నాన్నది భారత్.. అమ్మది జపాన్.. పూరిలో హోటల్.. గ్రేట్ లవ్ స్టోరీ..!

ట్రెండింగ్ వార్తలు