Iran: తగ్గిన ఇరాన్..! అణు కార్యక్రమాన్ని ఆపేస్తామని ప్రకటన.. కానీ..
అణ్వాయుధ ప్రోగ్రామ్ ను ఆపేవరకు దాడులు చేస్తూనే ఉంటామని అమెరికా ప్రకటించింది. అంతేకాదు దాడులు కూడా షురూ చేసింది.
- అమెరికా సంతృప్తికరమైన ప్రకటన ఇస్తే అణు పరీక్షలు నిలిపివేస్తాం
- అగ్రరాజ్యానికి ఇరాన్ కండీషనల్ ఆఫర్
- అమెరికా మిత్ర దేశాలే టార్గెట్ గా ఇరాన్ దాడులు
Iran: అమెరికాకు కండీషన్ తో కూడిన ఆఫర్ ఇచ్చింది ఇరాన్. ఆ దేశ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి కీలక ప్రకటన చేశారు. తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్ అందిస్తే అణ్వాయుధ ప్రోగ్రామ్ ను ఆపివేస్తామని వెల్లడించారు. అణ్వాయుధాల తయారీని ఆపేయాలని అమెరికా ముందు నుంచి ఇరాన్ ను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అణ్వాయుధ ప్రోగ్రామ్ ను ఆపేవరకు దాడులు చేస్తూనే ఉంటామని అమెరికా ప్రకటించింది. అంతేకాదు దాడులు కూడా షురూ చేసింది. ఈ క్రమంలో ఇరాన్ స్పందింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను ఆపేస్తామంది. అందుకుగాను అమెరికాకు ఒక కండీషన్ పెట్టింది ఇరాన్.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. మిస్సైళ్ల వర్షం కురిపించుకుంటున్నారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సంతృప్తికరమైన ప్రకటన ఇస్తే అణు పరీక్షలు నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు అమెరికా మిత్ర దేశాలే టార్గెట్ గా ఇరాన్ దాడులను కంటిన్యూ చేస్తోంది. తాజాగా ఖతర్, అజర్ బైజాన్ దేశాలపై అటాక్స్ చేసింది. నిత్యం డ్రోన్లతో దాడులు చేస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అజర్ బైజాన్ లోని నక్ చీవన్ ఎయిర్ పోర్ట్ పై డ్రోన్ దాడి చేసింది ఇరాన్. ఈ దాడిలో ఎయిర్ పోర్ట్ పాక్షికంగా ధ్వంసమైంది. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ఖతర్ రాజధాని దోహాపై ఇరాన్ భీకర దాడి చేస్తోంది. దోహాలోని అమెరికా ఎంబసీ లక్ష్యంగా మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. ఖతర్ గగనతలంలో భారీ ఎత్తున మిస్సైల్స్, డ్రోన్లు కనిపిస్తున్నాయి. దోహా నగరంలోని పలు ప్రాంతాలపై ఇరాన్ దాడులను ఖతార్ విదేశాంగ శాఖ ఖండించింది. ప్రజలెవరూ బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అలర్ట్ జారీ చేసింది.
Also Read: మరో దేశంపై ఇరాన్ దాడి.. ఎయిర్ పోర్ట్ పై అటాక్, ఇద్దరికి గాయాలు
