Pak Submarine : పాక్ సబ్‌మెరైన్ ప్లాన్‌కి భారత్ దగ్గర జవాబు ఉందా? అలాచేస్తే పాక్ ఫ్యూజులు మాడిపోతాయ్..
Pakistan Submarine in Bay of Bengal : ఏప్రిల్‌లో చైనా పాకిస్థాన్‌కి ఓ సబ్‌మెరైన్‌ను పంపింది. అది ప్రత్యేకంగా పాక్ కోసమే డిజైన్ చేసి బదిలీ చేస్తోన్న హంగోర్ తరహా జలాంతర్గామి. మొత్తం ఆరు హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లను పాకిస్థాన్‌కి చైనా పంపనుండగా అందులో మొదటిది ఏప్రిల్ నెలలో కరాచీకి చేరింది. చైనా నుంచి కొలంబో మీదుగా కరాచీకి వచ్చిన ఈ సబ్‌మెరైన్ బంగాళాఖాతంలో పాక్ ఉనికిని చాటుతుందంటూ ఆ దేశం ప్రకటించింది.
Pakistan Submarine in Bay of Bengal
Pakistan Submarine Threat In Bay of Bengal : గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ బంగ్లాదేశ్, చైనాతో కలిసి ఆయుధ ఒప్పందాలు చేసుకుంటుంది. అలానే రక్షణరంగంలో పెట్టుబడులు, ఆయుధ మార్పిడి కూడా ఈ దేశాలు చేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా భారత్‌పై కుట్ర కోణంలోనే సాగుతున్నాయని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుతం ఆ సందేహాలన్నీ నిజమే అని నిర్ధారించేలా సంకేతాలు వస్తున్నాయి.
Also Read : Pakistan : పాకిస్థాన్‌లో విషాదం.. శాంతి ర్యాలీలో ఆత్మాహుతి దాడి.. 14మంది మృతి..
ఏప్రిల్‌లో చైనా పాకిస్థాన్‌కి ఓ సబ్‌మెరైన్‌ను పంపింది. అది ప్రత్యేకంగా పాక్ కోసమే డిజైన్ చేసి బదిలీ చేస్తోన్న హంగోర్ తరహా జలాంతర్గామి. మొత్తం ఆరు హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లను పాకిస్థాన్‌కి చైనా పంపనుండగా అందులో మొదటిది ఏప్రిల్ నెలలో కరాచీకి చేరింది. చైనా నుంచి కొలంబో మీదుగా కరాచీకి వచ్చిన ఈ సబ్‌మెరైన్ బంగాళాఖాతంలో పాక్ ఉనికిని చాటుతుందంటూ ఆ దేశం ప్రకటించింది.
ఈ ప్రకటనను భారత్ సీరియస్‌గానే తీసుకుంటోంది. ఎందుకంటే 1971 యుద్ధం తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ బేఆఫ్ బెంగాల్లో తన సబ్‌మెరైన్‌ని ప్రవేశపెట్టింది. సబ్-మెరైన్ల ద్వారా భారత్ తూర్పు తీరంలో తన పాగా వేయాలనేది పాకిస్థాన్ ప్లాన్. అయితే, అదంత సులభమైన పనేంకాదని పాక్‌కి కూడా తెలుసు.. ఎందుకంటే
ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనే ఓ అరివీర భయంకర యాంటీ సబ్‌మెరైన్ షిప్‌ని భారత్ సముద్రజలాల్లోకి వదిలింది.
పాకిస్థాన్ దిగుమతి చేసుకున్న చైనా సరుకు.. హంగోర్ క్లాస్ సబ్‌మెరైన్ ఎలాపని చేస్తుందంటే ఇందులో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంది. దీంతో సబ్ మెరైన్ దాదాపు 20రోజుల వరకూ సముద్రంపైకి రాకుండానే ప్రయాణం చేయగలదు. నిశ్సబ్దంగా తనపని తాను చేసుకోగలదు. అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతంవైపు కూడా తమ నావికాదళ ప్రభావాన్ని చూపాలనేది పాక్ తాపత్రయం.
భౌగోళికంగా పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ మన తీరప్రాంతంవైపు ఒకేసారి కదలికలను పెంచితే అది భారత నావికాదళానికి పరీక్ష పెట్టేదే అవుతుంది. అందుకే ఈ సబ్‌మెరైన్ వ్యూహాన్ని ముందే దెబ్బకొట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. భారతనావికదళానికి ఉన్న అతిపెద్ద బలం సబ్‌మెరైన్ వార్ఫేర్. నౌకాదళం, అధునాతన నిఘా వ్యవస్థలు, సముద్ర గస్తీ విమానాలతో పాటు
వ్యూహాత్మకంగా ఉన్న స్థావరాల మద్దతుతో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోగలదు. గత కొద్దికాలంగా జలాంతర్గాముల సమర్ధతని పెంచడంతో పాటు
ఎప్పటికప్పుడు వాటిని ఆధునీకరిస్తోంది.
విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్, కీలకమైన సముద్ర మార్గాలను పర్యవేక్షించడానికి, వ్యూహాత్మక స్థావరాలను రక్షించడంలో ప్రతి నిమిషం గస్తీ కాస్తోంది. అలానే అండమాన్ నికోబార్ ఐలండ్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి మొత్తం బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలోని శత్రువుల కదలికలను పర్యవేక్షిస్తోంది. శాటిలైట్ సర్వైవలెన్స్, లాంగ్ రేంజ్ జెట్ ఫైటర్స్ సహా అనేక మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఇక్కడి నుంచే భారత్ నావికాదళం నిర్వహిస్తోంది. ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ జలాంతర్గాములుపై అణుశక్తితో నడిచే బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించగలగడం ప్రత్యేకంగా గమనించాలి. ఇవన్నీ కూడా ఒక్క తూర్పు ప్రాంతంలోనే కాదు.. ఇతరత్రా వచ్చి పడే ప్రమాదాలను నివారించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలుగా చెప్తున్నారు.
