Manchu Lakshmi : ప్రెండ్షిప్ డే.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన మంచు లక్ష్మీ.. మిస్డ్ కాల్స్, చెత్త జోకులు..
స్నేహితుల దినోత్సవం సందర్భంగా నటి మంచులక్ష్మీ (Manchu Lakshmi) సోషల్ మీడియా వేదికగా కొన్ని స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మిత్రులారా.. మిస్డ్ కాల్స్, చెత్త జోకులు, అప్పటికప్పుడు వేసే ప్లాన్లు, 5 నిమిషాల్లో వస్తున్నాను డైలాగ్లు వంటి వాటిని తట్టుకుని నిలబడే స్నేహాలకు శుభాకాంక్షలు. మీ అందరినీ ప్రేమిస్తున్నాను, మీరే నా ప్రాణదాతలు అంటూ రాసుకొచ్చింది.










