Current Gold Rate: గోల్డ్‌ రేట్లు తగ్గడానికి సుంకం తగ్గింపే కారణమా?

అమెరికా ఎన్నికల తర్వాత ఈ ఏడాది చివరి వరకు పసిడి పరుగులు మళ్లీ మొదలవుతాయన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

Gold

జిల్‌ జిగేల్ మంటూ రికార్డుస్థాయి రేట్లతో పరిగెత్తిన పసిడి దిగి రావడంతో గోల్డ్‌కు మరింత ఆదరణ పెరుగుతోంది. ఆరు నెలల క్రితం ఉన్న రేట్ల కంటే ఇప్పుడు తగ్గింది. సామాన్యుడికి అందన్నంత దూరంలో ఉన్న పసిడి ప్రైస్ దిగి రావడంతో.. మధ్య తరగతి జనం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ వస్తుండటంతో రాబోయే రోజుల్లో ఇంకా కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ఆల్‌ టైమ్‌ హైరేట్స్ నుంచి ఇప్పుడు ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి పసిడి రేట్లు.

ఇప్పుడు గోల్డ్ రేట్లు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన దగ్గర కస్టమ్స్ డ్యూటీ తగ్గించడమే కాదు.. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా బంగారం రేటు తక్కువగా ఉంది. సప్లై పెరిగి డిమాండ్‌ తగ్గడంతో పసిడి గ్రాఫ్ పడిపోతోంది. సేమ్‌ టైమ్ ఇప్పుడు శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో కూడా గోల్డ్ రేట్లు తగ్గినట్లు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్స్‌, వడ్డీ రేట్లలో మార్పులు కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. డాలర్, రూపాయి మారకం విలువ, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, చైనా ప్రభుత్వ నిర్ణయాలతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అమెరికా ఎన్నికల తర్వాత ఈ ఏడాది చివరి వరకు పసిడి పరుగులు మళ్లీ మొదలవుతాయన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో తగ్గుతున్న ధరలతో పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఈక్విటీ నుంచి కమోడిటీకి మారుతోంది.

Also Read: గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

ట్రెండింగ్ వార్తలు