Anil Kumar Yadav : రూ.8లక్షలు కట్టండి.. ఆ ఫోన్ ఆడియో లీక్‌పై అనిల్ కుమార్ యాదవ్ సీరియస్

ఫోన్ ఆడియో లీక్ పై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. డబ్బులు కట్టాలంటూ అనిల్ కు లోన్ రికవరీ ఏజెంట్లు వరుస ఫోన్లు చేసినట్లుగా ఆడియోలు వైరల్ అయ్యాయి. ఆడియో లీక్ పై అనిల్ కుమార్ యాదవ్ ఐజీ త్రివిక్రమ వర్మకు ఫోన్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఆడియో లీక్ పై విచారణ చేపట్టాలని ఐజీని కోరారు.

Anil Kumar Yadav : ఫోన్ ఆడియో లీక్ పై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. డబ్బులు కట్టాలంటూ అనిల్ కు లోన్ రికవరీ ఏజెంట్లు వరుస ఫోన్లు చేసినట్లుగా ఆడియోలు వైరల్ అయ్యాయి. ఆడియో లీక్ పై అనిల్ కుమార్ యాదవ్ ఐజీ త్రివిక్రమ వర్మకు ఫోన్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఆడియో లీక్ పై విచారణ చేపట్టాలని ఐజీని కోరారు. అయితే, అధికార పార్టీకే చెందిన ప్రముఖ వ్యక్తి ఆడియోను లీక్ చేశారని అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.

లోన్ రికవరీ ఏజెంట్ల అరాచకాలు తారస్థాయికి చేరాయి. డబ్బు తిరిగి కట్టకపోతే.. ఆ వ్యక్తులను లేదా వారికి తెలిసిన వ్యక్తులకు ఫోన్లు చేసి రాబందుల్లా పీక్కు తింటున్నారు. లోన్ డబ్బులు కట్టాల్సిందేనంటూ రాచి రంపాన పెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ని సైతం లోన్ రికవరీ ఏజెంట్లు వేధించడం హాట్ టాపిక్ గా మారింది. లోన్ తీసుకున్న వ్యక్తితో తనకెలాంటి సంబంధం లేదని, దయచేసి తనకు ఫోన్లు చేయొద్దని మర్యాదపూర్వకంగా మాట్లాడినా.. పదే పదే ఫోన్లు చేసి టార్చర్ పెట్టారు.

తొలుత ఫుల్లర్‌టన్ బ్యాంక్ నుంచి ఓ మహిళా ఏజెంట్ ఫోన్ చేసి.. పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి మీ ఫోన్ నంబర్‌ను ప్రత్యామ్నాయంగా ఇచ్చారని, ఆయన తీసుకున్న లోన్ మీరే కట్టాలని అనిల్ కుమార్ యాదవ్ తో చెప్పింది. అతనెవరో తెలియదని, కావాలంటే కేసు పెట్టి ఆ వ్యక్తిని జైల్లో పెట్టుకోండని అనిల్ చెప్పారు. అప్పుడు మరో మహిళా రికవరి ఏజెంట్ ఫోన్ అందుకొని, బెదిరింపులకు దిగింది. అశోక్ ఎవరో తనకు తెలియదని చెబుతున్నా.. ఆ అశోక్, మీరు కలిసి తిన్న రూ. 8 లక్షలు ఎవరు కడతారు? కట్టాల్సింది మీరేనంటూ దబాయించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనిల్ కుమార్.. చెప్పుతో కొడతానంటూ ఫైర్ అయ్యారు.

”ఇంకోసారి నేను డబ్బులు తీసుకున్నా అని అంటే చెప్పు తీసుకొని కొడతా. దారినపోయే వాడెవడో నా నెంబర్ ఇచ్చినంత మాత్రాన నేనే డబ్బులు తీసుకున్నా అని ఎలా అడుగుతారు. అశోక్ కుమార్ పేరుతో తనకు బ్రదర్ ఇన్ లాస్ ఎవరూ లేరు” అని అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.

అప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ పెట్టేసి సైలెంట్ అయిపోయారు. అయితే, 20 సార్లకు పైగా ఫోన్ చేసి ఆ మహిళ హింసించింది. డబ్బులు కట్టేదాకా ఫోన్ చేస్తూనే ఉంటానంటూ మొండికేసింది. ఈ వ్యవహారం తెగేలా లేదనుకున్న అనిల్ కుమార్.. తనదైన శైలిలో యాక్షన్ తీసుకున్నారు. ఆ బ్యాంక్ వివరాలు సేకరించి, పోలీసులను పంపించారు. పోలీసులు ఆ ఏజెంట్లను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. షాకింగ్ విషయం ఏంటంటే. అప్పటివరకూ తాము మాట్లాడింది ఎమ్మెల్యే అనిల్ కుమార్‌తోనని ఆ ఏజెంట్లు గ్రహించలేకపోయారు.

కాగా, దీనికి సంబంధించి ఆడియో లీక్ కావడం ఇప్పుడు దుమారం రేపుతోంది. దీనిపై అనిల్ కుమార్ యాదవ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ఆడియో లీక్ వెనుకున్నది ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు