Vidya Vasula Aham teaser : అమ్మాయిలను పడేయడం కష్టం కాదు మాస్టారు.. అమ్మాయిలతో పడడమే కష్టం
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘విద్యా వాసుల అహం’.
- Thota Vamshi Kumar
- Updated on- May 8, 2024 / 09:03 PM IST
Vidya Vasula Aham teaser
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘విద్యా వాసుల అహం’. మణికాంత్ గెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో అతి త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది చిత్ర బృందం. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
దాంపత్యం విలువ ఏంటో చెప్పే చిన్న కథ ఒకటి ఉంది అని తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. విద్యాగా శివానీ, వాసుగా రాహుల్ లు పరిచయం అవుతారు. ‘నాకు ఏ పెళ్లి అక్కర్లేదు’ అనే డైలాగ్‌తో విద్య క్యారెక్టర్‌ను, ‘పెళ్లొక్కటేరా వద్దనుకున్నది’ అనే డైలాగ్‌తో వాసు క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. ‘అమ్మాయిలను పడేయడం కష్టం కాదు మాస్టారు.. అమ్మాయిలతో పడడమే కష్టం’ అనే డైలాగులు ఆకట్టుకున్నాయి.
Bhaje Vaayu Vegam : కార్తికేయ ‘భజే వాయు వేగం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్‌కు టైం సెట్..
ఈ టీజర్ గమనిస్తే.. కొత్తగా పెళ్లైన జంటల మధ్య ప్రేమతో పాటు ఇగో కూడా ఉంటుంది. మరీ ఈ జంట తమ ఇగోని వదిలి కలిసి ఉంటారా.. అహంతో విడిపోతారా అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది.
