CM Jagan : చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

విశ్వసనీయత లేని చంద్రబాబు.. జైల్లో ఉన్నా, ప్రజల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. CM Jagan

CM Jagan On Chandrababu Arrest

CM Jagan On Chandrababu Arrest : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ ఆరోపణలపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ సమయంలో నేను ఇండియాలోనే లేను..
చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. చంద్రబాబును ఎవరూ కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో తాను లండన్ లో ఉన్నానని జగన్ గుర్తు చేశారు. విశ్వసనీయత లేని చంద్రబాబు.. జైల్లో ఉన్నా, ప్రజల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు పొత్తు కోసం వెంపర్లాడుతున్నాయన్న జగన్.. రెండు సున్నాలు కలిసినా వచ్చేది పెద్ద సున్నానే అని సెటైర్ వేశారు.

Also Read : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్

రెండు సున్నాలు కలిసినా వచ్చేది పెద్ద సున్నానే..
”చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదు. కారణం ఆయనకు విశ్వసనీయత లేదు. చంద్రబాబుని ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు. చంద్రబాబు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. చంద్రబాబు అరెస్ట్ కూడా జగన్ భారత్ లో లేనప్పుడు, జగన్ లండన్ లో ఉన్నప్పుడు జరిగింది. వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంతమంది కలిసినా ప్రయోజనం లేదు. రెండు సున్నాలు కలిసినా లేదా నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ పెద్ద సున్నానే. ప్రజలకు వాళ్లు చేసిన మంచి ఒక పెద్ద సున్నా కాబట్టి ఎన్ని సున్నాలు కలిసినా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే.

పార్టీ పెట్టి 15ఏళ్లు అవుతున్నా అభ్యర్థులు లేరు..
15 సంవత్సరాలు అయ్యింది పార్టీ పెట్టి. ఇవాళ్టి కూడా 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. గ్రామాల్లో జెండా మోసేందుకు మనిషి లేడు. ఆయన జీవితం అంతా చంద్రబాబుని భుజాన ఎత్తుకుని మోయడానికే 15 సంవత్సరాలు పట్టింది ఆ పెద్ద మనిషికి. ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చంద్రబాబు చేసిన మోసాల్లో పార్టనర్. చంద్రబాబు దోచుకున్న దాంట్లో కూడా పార్టనర్.

Also Read : చంద్రబాబు కేసు.. సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా, జస్టిస్ త్రివేది కీలక వ్యాఖ్యలు

మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు..
ఎన్నికలు బహుశా మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయి. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 175 నియోజకవర్గాల్లో మీటింగ్ లు, బహిరంగ సభలు జరుగుతాయి. ప్రతిరోజు మూడు సభలు జరుగుతాయి. రేపు జరగబోయేది కులాల మధ్య యుద్ధం కాదు, రేపు జరగబోయేది క్లాష్ వార్. పేదవాడు ఒకవైపున, పెత్తందారు మరోవైపున. పేదవాళ్లు మొత్తం ఏకం కావాలి” అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు