CM Jagan Humanity : సీఎం జగన్ గొప్ప మనసు.. కష్టంలో ఉన్న ఓ తల్లికి ఆపన్నహస్తం

ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కష్టంలో ఉన్న ఓ తల్లికి ఆపన్నహస్తం అందించారు. జనాల మధ్య నుంచి చేతుల్లో బిడ్డని చూపిస్తూ ఆవేదనగా ఉన్న మహిళను గుర్తించిన సీఎం జగన్.. వెంటనే తన కాన్వాయ్ ఆపించారు. ఆ తల్లిని పిలిపించుకుని ఆమె కష్టాన్ని తెలుసుకుని చలించిపోయారు. ఆమెకు తక్షణమే సాయం అందేలా చర్యలు తీసుకుని ఆమె కళ్లలో ఆనందం నింపారు.

CM Jagan Humanity : ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కష్టంలో ఉన్న ఓ తల్లికి ఆపన్నహస్తం అందించారు. కాకినాడ జిల్లా తుని పర్యటనలో ఈ ఘటన జరిగింది. జనాల మధ్య చంటిబిడ్డతో ఉన్న ఓ తల్లిని గుర్తించిన సీఎం జగన్.. సడెన్ గా తన కాన్వాయ్‌ను ఆపించారు. వాహనం దిగొచ్చి మరీ ఆ తల్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కష్టానికి చలించిపోయారు. వెంటనే ఆమెకు సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజ కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయం కోసం ఆమె సీఎం జగన్‌ను కలవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే జనాల మధ్య నుంచి తన చంటిబిడ్డను సీఎం కాన్వాయ్‌కు కనిపించేలా ప్రయత్నించింది. అది గమనించిన సీఎం జగన్‌.. కాన్వాయ్‌ను ఆపించారు. ఆ తల్లీబిడ్డలను పిలిపించుకుని సమస్య తెలుసుకున్నారు.

తన బిడ్డ ఆరోగ్య పరిస్ధితిని సీఎం జగన్‌కు వివరించి ఆదుకోవాలని తనూజ కోరడంతో జగన్ వెంటనే స్పందించారు. అప్పటికప్పుడే ఆమెకు సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాబుకి మెరుగైన వైద్యం అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే ఆర్థిక సాయం అందించాలని, వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలన్నారు. కష్టంలో ఉన్న తల్లికి ఆపన్నహస్తం అందించిన సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన గొప్ప మనసును అంతా మెచ్చుకుంటున్నారు.

కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన నక్కా తనూజ కొడుకు నక్కా ధర్మతేజ(10) పుట్టుక నుండి మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. ధర్మతేజ పూర్తిగా తల్లిపైనే ఆధారపడ్డాడు. దీంతో కూలి పనులు చేసుకుని జీవించే తనూజ ఆర్థికంగాను, మానసికంగాను తీవ్ర ఇబ్బందులు పడుతోంది. తన కుమారుడికి వికలాంగ పింఛను ఇప్పించాలని అధికారులకు అర్జీ పెట్టుకుంది.

నిరాశకు లోనైన తనూజ తన నిస్సహాయ స్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకుని సహాయం అర్థించాలనుకుంది. గురువారం పాయకరావు పేటలో వివాహ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరైన శ్రీ జగతా అప్పారావు కళ్యాణ మండపం వద్దకు చేరి జనం మధ్యలో నిలుచుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్సులో నుండి దీన వదనంతో నిలబడిన తనూజను చూసి, బస్సు దిగారు. ఆమెను తన దగ్గరికి పిలిచి ఆమె కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.

బాలుడు ధర్మతేజ పరిస్థితి, తల్లి తనూజ వేదనను చూసి జగన్ చలించిపోయారు. తన వెంట వచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను పిలిచారు. ఆ తల్లికి తక్షణం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించి, వచ్చే నెల నుండి బాలుడికి వికలాంగ పింఛను అందేలా చూడాలని సూచించారు. పిలిచి మరీ తన కష్టం తెలుసుకోవడమే కాక సాయం కూడా అందించి, తన కష్టాలను తొలగించిన ముఖ్యమంత్రి జగన్ మంచి మనసుకు తల్లి నక్కా తనూజ కృతజ్ఞతలు తెలియజేసింది.

ఇక సీఎం జగన్ పర్యటన ముగిసిన వెంటనే రెండు గంటలలోపే జిల్లా కలెక్టర్ శుక్లా… తల్లి తనూజ, బాలుడు ధర్మతేజను కాకినాడ కలెక్టరేట్ కు పిలిపించుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 10 వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం బాలుడి తల్లికి అందించారు. అలాగే బాలుడికి వచ్చే నెల నుండి వికలాంగ పెన్షన్ మంజూరు చేశారు. అంతేకాదు బాలుడి వైకల్యం దృష్ట్యా అతడికి 35వేల రూపాయల విలువైన వీల్ చైర్ కూడా ఇప్పించారు.

ట్రెండింగ్ వార్తలు