Sai Pallavi Special Cute Making Video Released from Thandel Movie on Her Birthday
Sai Pallavi : నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి జంటగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్’. చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథతో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇప్పటికే తండేల్ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఆ గ్లింప్స్ చివర్లో సాయి పల్లవి సముద్రం దగ్గర బుజ్జితల్లి అనగానే నవ్వుతూ ఉన్న క్లిప్ బాగా వైరల్ అయింది. తాజాగా నేడు సాయి పల్లవి పుట్టిన రోజు కావడంతో తండేల్ సినిమా నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. సాయి పల్లవి గురించి గొప్పగా చెప్తూ తన పర్ఫార్మెన్స్ లతో, షూటింగ్ సెట్స్ లో తను చేసే అల్లరి, మంచి పనులతో ఈ మేకింగ్ వీడియోని తయారుచేసి రిలీజ్ చేశారు. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉండటంతో వైరల్ గా మారయింది. మీరు కూడా సాయి పల్లవి క్యూట్ వీడియో చూసేయండి..
ఇక గతంలో ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమాతో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా మెప్పించి హిట్ కొట్టారు. మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు తండేల్ తో వస్తుండటంతో ఈ సినిమా కుడా కచ్చితంగా హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు.