ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టు అధికారికంగా వైదొలిగింది. ముంబై ఇండియన్స్ ఎలిమినేటెడ్ అని పాయింట్ల పట్టికలోనూ కనపడుతోంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడి కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలుపొందింది. మిగతా ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది. రన్ రేట్ కూడా -0.212గా ఉంది.
పాయింట్ల పట్టికలో ఆ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు విజయం సాధించింది. 2013, 2015, 2017, 2019, 2020లో కప్ సాధించింది. ఇప్పుడు కనీసం ప్లేఆఫ్స్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం.
బుధవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచులో లక్నోపై హైదరాబాద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం ముంబై జట్టు అధికారికంగా నిష్క్రమించింది. ఇక హైదరాబాద్ జట్టు ఫ్లేఆఫ్స్ రేసులో స్థిరపడింది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
పాయింట్ల పట్టిక
జట్టు | మ్యాచులు | గెలుపు | ఓటమి | పాయింట్లు | నెట్
రన్‌రేట్ |
---|---|---|---|---|---|
కేకేఆర్ | 11 | 8 | 3 | 16 | 1.453 |
ఆర్ఆర్ | 11 | 8 | 3 | 16 | 0.476 |
ఎస్ఆర్హెచ్ | 12 | 7 | 5 | 14 | 0.406 |
సీఎస్కే | 11 | 6 | 5 | 12 | 0.7 |
డీసీ | 12 | 6 | 6 | 12 | -0.316 |
ఎల్ఎస్జీ | 12 | 6 | 6 | 12 | -0.769 |
ఆర్సీబీ | 11 | 4 | 7 | 8 | -0.049 |
పంజాబ్ | 11 | 4 | 7 | 8 | -0.187 |
ముంబై* | 12 | 4 | 8 | 8 | -0.212 |
గుజరాత్ | 11 | 4 | 7 | 8 | -1.32 |
Also Read: హైదరాబాద్, లక్నో ఆటతీరుపై టాప్-10 ఫన్నీ మీమ్స్ ఇవే..