AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం

పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం విధించింది.

AP Govt : పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం విధించింది. మంగళవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Body Ageing: ఇవి తింటున్నారా.. ముసలితనం ముందే రావడం ఖాయం

నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులు గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపైనా ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతో నైనా తయారు చేయడం, అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం నేరం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ గుట్కా, పాన్ మసాలాలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో గుట్కా నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారని హైకోర్టు సీరియస్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు