Covid Rules : కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే రూ.25వేలు ఫైన్, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

కోవిడ్ నిబంధనలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.

Covid Rules : రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రోజూ వేల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు వందల సంఖ్యకు దిగొచ్చాయి. దీంతో.. రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నిబంధనలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలంది.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించటం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. మాస్కు ధరించని వారికి రూ.100 జరిమాన విధిస్తారు. ఇక వాణిజ్య ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే రూ.25 వేలు జరిమానా విధించనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

AP Covid : ఏపీలో రాత్రి వేళ కర్ఫ్యూ తొలగింపు.. మాస్క్ కంపల్సరీ

కరోనా థర్డ్ వేవ్ ముప్పును దృష్టిలో ఉంచుకుని జనవరి 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూ ప్రభుత్వం తొలుత ఉత్తర్వులు జారీ చేసింది. కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో కర్ఫ్యూని పొడిగిస్తూ మరోసారి ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగింది. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతో నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. తాజాగా మరొకరు కరోనాతో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఒక కరోనా మరణం సంభవించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 4వేల 636 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 15వేల 193 కరోనా టెస్టులు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,28,46,978 కోవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,13,212. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,83,788. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14వేల 698. రాష్ట్రంలో ప్రస్తుతం 14వేల 726 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారంతో(749 కేసులు, 3 మరణాలు) పోలిస్తే సోమవారం కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గడం ఊరటనిచ్చే అంశం.

AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

మొన్నటి వరకు ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దీంతో కొత్త కేసులు భారీగా తగ్గాయి. ప్రజలు కాస్త రిలీఫ్ అవుతున్నారు.

దేశంలో కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. కొంతకాలంగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతుండటంతో మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లే కన్పిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 10.67లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 34వేల 113 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 10వేలకు పైగా తగ్గింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 3.19శాతానికి దిగొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు