AP High Court : తిరుపతిలో అమరావతి రైతుల సభకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Amaravati Farmers’ public meeting : తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17న తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు సభ నిర్వహించనున్నారు. అయితే నిబంధనలకు లోబడి సభ నిర్వహించుకోవాలని హైకోర్టు సూచించింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల లోపు నిర్వహించుకోవాలని ఆదేశాలిచ్చింది. కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అయితే సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు..తిరుపతిలో అమరావతి రైతు సభకు అనుమతిచ్చింది. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల లోపు సభ నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కోవిడ్ కు సంబంధించిన ప్రోటో కాల్స్ పాటించాలని ఆదేశాలు ఇచ్చింది.

Bus Accident : జల్లేరు వాగు నుంచి బస్సు వెలికితీత

మరోవైపు మూడు రాజధానులకు అనుకూలంగా డిసెంబర్ 17వ తేదీన తిరుపతిలో సభ నిర్వహించుకునేందుకు తమకు కూడా అనుమతి ఇవ్వాలని రాయలసీమ మేధావుల ఫోరం చేసిన వినతిని ఏపీ హైకోర్టు తిరస్కరించింది. అదే రోజు సభ నిర్వహించుకోవడానికి అనుమతి నిరాకరించింది. కావాలంటే డిసెంబర్ 18వ తేదీన సభ నిర్వహించుకోవచ్చని వారికి సూచించింది. కానీ తమకు డిసెంబర్ 17 వ తేదీనే తిరుపతిలో సభకు అనుమతి కావాలని రాయలసీమ మేధావుల ఫోరం కోరినప్పటికీ.. కోర్టు తిరస్కరించింది.

రెండు సభలు ఒకే రోజు జరిగితే క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది..పోలీసు బందోబస్తు, భద్రతా సమస్యలుంటాయి.. కాబట్టి ఒకే రోజు రెండు సభలు నిర్వహించుకోవడానికి అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. మరుసటి రోజైన డిసెంబర్ 18న సభ నిర్వహించుకోవడానికి రాయలసీమ మేధావుల ఫోరంకు సూచనలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు