AP Corona Report : ఏపీలో కొత్తగా 59 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 59 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మరో 83మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 523 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.(AP Corona Report)

AP Corona Report: ఏపీలో గడిచిన 24 గంటల్లో 10వేల 914 కరోనా పరీక్షలు నిర్వహించగా, 59మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 83మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నేటివరకు 23,18,943 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,03,690 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇంకా 523 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కోవిడ్ తో 14వేల 730 మంది మరణించారు. నేటి వరకు రాష్ట్రంలో 3,32,78,495 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 26 కరోనా కేసులు మాత్రమే వచ్చాయి.(AP Corona Report)

Covid Vaccine Children : మార్చి 16 నుండి 12-15 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. వరుసగా రెండోరోజు 3వేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే మరణాలు మాత్రం 100కు చేరువగా నమోదయ్యాయి. సోమవారం 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2వేల 568 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దేశంలో ప్రస్తుతం మహమ్మారి ఉధృతి ప్రారంభ రోజుల స్థాయికి తగ్గింది. ఇక ఇప్పటివరకూ 4.29 కోట్ల మంది ఈ వైరస్‌ బారినపడ్డారు.

ముందురోజు 27గా ఉన్న మరణాల సంఖ్య.. 24 గంటల వ్యవధిలో 97కి పెరిగింది. అందులో ఒక్క కేరళలోనే 78 మరణాలున్నాయి. మునుపటి లెక్కల్ని సవరిస్తుండటమే ఈ పెరుగుదలకు కారణం. గత కొంతకాలంగా కొత్త కేసులు దిగొస్తున్నప్పటికీ.. మృతుల సంఖ్యలో మాత్రం ఈ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5.15 లక్షల మంది కరోనాకు బలయ్యారు.

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో బాధితుల సంఖ్య 33,917కి తగ్గిపోయింది. మొత్తం కేసుల్లో ఆ వాటా 0.08 శాతానికి సమానం. ఇక నిన్న 4,722 మంది కోలుకోగా.. నిన్నటివరకూ 4.24 కోట్ల మందివైరస్‌ను జయించారు. రికవరీ రేటు 98.72 శాతానికి చేరింది.

నిన్న 19 లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 180 కోట్లు దాటింది. ఇక బుధవారం నుంచి టీకా కార్యక్రమంలో మరో దశ ప్రారంభం కానుంది. 12-14 ఏళ్ల పిల్లలకు టీకా వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనున్నారు.

India Covid : భారీగా తగ్గిన కరోనా కేసులు..

మార్చి 16 నుంచి కరోనా టీకా కార్యక్రమంలో మరో దశను కేంద్రం ప్రారంభించనుంది. 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు టీకా ఇవ్వనుంది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను వారికి అందించనుంది. ఈ టీకా పంపిణీ ప్రక్రియలో భాగంగా.. 12 ఏళ్లు పైబడిన వారు బుధవారం నుంచి కొవిన్‌ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు