Badvel By-Election : జగన్‌‌ను కలువనున్న కడప వైసీపీ నేతలు

బైపోల్‌కు షెడ్యూల్ విడుదల కావడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్‌ నియోజకవర్గం వైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.

Kadapa YCP Leaders : బద్వేల్‌ ఉప ఎన్నికపై వైసీపీ ఫోకస్‌ పెంచింది. బైపోల్‌కు షెడ్యూల్ విడుదల కావడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్‌ నియోజకవర్గం వైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ సుధను ప్రకటించిన వైసీపీ.. ఎన్నికల వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలవనున్నారు కడప జిల్లా నేతలు. వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Read More : Ap : ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్యవహారం..రాజకీయ రచ్చ

ఉప ఎన్నికపై నేతలకు బాధ్యతలు, ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారాయన. అక్టోబర్ 1న బద్వేల్ బై పోల్‌కు నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13వ తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల రానున్నాయి.

Read More : Telangana : ఏపీ ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్

నోటిషికేషన్ వెలువడడంతో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ ప్రారంభమైంది. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య సుధను అధిష్టానం ఖరారు చేసింది. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి ఇవ్వడం తమ సంప్రదాయమని వైసీపీ వెల్లడించింది. వెంకట సుబ్బయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019లో బద్వేల్ నుంచి వైసీపీ తరపున డాక్టర్ వెంకట సుబ్బయ్య బరిలోకి దిగి..గెలుపొందారు. ఈయనకు భార్య, ఓ కుమారుడున్నారు. 2016లో ఈయన బద్వేల్ వైసీపీ కో ఆర్డినేటర్ గా పని చేశారు. 2019లో తొలిసారిగా..డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ట్రెండింగ్ వార్తలు