Chandrababu : చంద్రబాబు క్వాష్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ

సెక్షన్ 17-ఏ పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. Chandrababu

Chandrababu Quash Petition : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో తన పేరుని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సెక్షన్ 17-ఏ పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కోర్టుకు అవసరమైన లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తానని హరీశ్ సాల్వే తెలిపార. సాల్వే విజ్ఞప్తికి సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.

మధ్యతర బెయిల్ ఇచ్చేందుకు నో..
కాగా, ఈ కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరగా.. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన కేసులో వాదనలు విన్నాము, ఇక తీర్పు వెలువరిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం తేల్చి చెప్పింది.

Also Read : ఏపీ సీఎం జగన్‌పై టాలీవుడ్ హీరో తీవ్ర విమర్శలు

ఇది రాజకీయ కక్ష సాధింపే-హరీశ్ సాల్వే
సెక్షన్ 17-ఏపై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ” 17A రెట్రో యాక్టివ్ గా వర్తిస్తుంది. 17A కింద చంద్రబాబుకి రక్షణ కల్పించాలి. 17A కింద కచ్చితంగా అనుమతి తప్పనిసరి. ఎన్నికలు వస్తున్నాయని, ఫిక్స్ చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులైనందు వల్లే తప్పుడు కేసులు. 17ఏ గనుక లేకుంటే పబ్లిక్ సర్వెంట్స్ అందరూ పోతారు” అని హరీశ్ సాల్వే వాదించారు.

అయితే, ఎవరూ కూడా దీనిని ఛాలెంజ్ చేయలేదు కదా? అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. 17ఏ రెట్రాస్పెక్టివ్ గా ఉండదని ప్రభుత్వం అంటోంది కదా అని జస్టిస్ అనిరుద్ధ బోస్ అడిగారు. దీనికి స్పందించిన హరీశ్ సాల్వే.. అన్ని అంశాలను లిఖితపూర్వకంగా ఇస్తామని తెలిపారు.

Also Read : మోదీ, జగన్ కలిసే ఆ పని చేస్తున్నారు : అరుణ్ కుమార్

తీర్పుని రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..
సెక్షన్ 17(ఏ) అమల్లోకి రాకముందు కూడా చెల్లుబాటు అవుతుందని వాదించారు హరీశ్ సాల్వే. చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని, ఆయన 73 ఏళ్ల వయసు కలిగిన పెద్ద మనిషి అని, ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

శుక్రవారానికి విచారణ వాయిదా..
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటీషన్లపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశాలపై విచారణను వాయిదా వేసింది కోర్టు. లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని ఇరుపక్షాల న్యాయవాదులను కోర్టు ఆదేశించింది.

 

ట్రెండింగ్ వార్తలు