Sai Pallavi : ఇక నుంచి డాక్టర్ సాయి పల్లవి.. MBBS పట్టా పుచ్చుకున్న సాయి పల్లవి..

కొన్నాళ్ల క్రితమే సాయి పల్లవి మెడిసిన్ పూర్తిచేసిందని, త్వరలోనే హాస్పిటల్ కూడా కట్టబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

Sai Pallavi Completed her MBBS Graduation Ceremony Photos Videos goes Viral

Sai Pallavi : తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సాయి పల్లవి. మలయాళం సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ఈ మలయాళ కుట్టి తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. తెలుగులో బోలెడంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకొని లేడీ పవర్ స్టార్ అనిపించుకుంటుంది సాయి పల్లవి. త్వరలో నాగ చైతన్య సరసన తండేల్ సినిమాతో రాబోతుంది.

అయితే సాయి పల్లవి సినిమాల కంటే ముందు నుంచి మెడిసిన్ చదువుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి వచ్చాక కూడా సాయి పల్లవి మెడిసిన్ చదివింది. కొన్నాళ్ల క్రితమే సాయి పల్లవి మెడిసిన్ పూర్తిచేసిందని, త్వరలోనే హాస్పిటల్ కూడా కట్టబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. సాయి పల్లవి జార్జియా దేశంలోని Tbilisi State Medical University నుంచి మెడిసిన్ చేసింది.

Also Read : Anna Ben : ‘కల్కి’ షూటింగ్‌లో గాయాల పాలైన నటి.. ఫోటోలు షేర్ చేసి..

ఇటీవల సాయి పల్లవి రెండు రోజుల క్రితం జార్జియా వెళ్లి తాను చదివిన యూనివర్సిటీలో MBBS గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకొని వచ్చింది. గ్రాడ్యుయేషన్ డే రోజు తన కాలేజీలో ఫ్రెండ్స్ తో సరదాగా గడిపింది. దీంతో అక్కడ సాయి పల్లవి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇపుడు సాయి పల్లవి కాదు డాక్టర్ సాయి పల్లవి అనాలి అని అంటున్నారు అభిమానులు. మరి సాయి పల్లవి ఫ్యూచర్ లో హాస్పిటల్ కడుతుందా, డాక్టర్ గా పనిచేస్తుందా చూడాలి.