Telangana government appointed corporations chairperson full list here
Telangana corporation chairmans: తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో 442 విడుదల చేసింది. గత మార్చి నెలలోనే 35 కార్పొరేషన్ల చైర్‌పర్సన్ పదవులకు పేర్లు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. తాజాగా జీవో విడుదల చేయడంతో 35 కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లుగా నియమితులైన వారు బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు పదవుల్లో ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే గతంలో ప్రకటించిన వారిలో ముగ్గురిని ప్రభుత్వం తప్పించడం చర్చకు దారితీసింది.
ఆ ముగ్గురికీ షాక్..
గత మార్చిలో ప్రకటించిన జాబితాలోని ముగ్గురు నేతలను ప్రభుత్వం పక్కన పెట్టింది. తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను ప్రకటించగా.. జీవోలో ఆమె పేరు లేకపోవడంతో పార్టీలో చర్చ జరుగుతోంది. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవిని తీసుకునేందుకు జగదీశ్వరరావు ఇష్టపడకపోవడంతో జీవోలో ఆయన పేరు కూడా లేదు. గతంలో ప్రకటించిన కొత్త నాగుకు సైతం తాజా జాబితాలో స్థానం దక్కలేదు.
తెలంగాణ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు వీరే
1. స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్: అన్వేష్ రెడ్డి
2. ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: కాసుల బాలరాజు
3. కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్: జంగా రాఘవరెడ్డి
4. స్టేట్ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్: మనాల మోహన్ రెడ్డి
5. స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్: రాయల నాగేశ్వరరావు
6. ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్: జ్ఞానేశ్వర్ ముదిరాజ్
7. ఫిషరీస్ కోపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్: మెట్టు సాయికుమార్
8. గ్రంథాలయ పరిషత్: ఎండీ రియాజ్
9. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పొదెం వీరయ్య
10. ఆర్యవైశ్య కార్పొరేషన్: కాల్వ సుజాత
11. పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: గురునాథ్ రెడ్డి
12. ట్విన్ సిటీస్ సెట్విన్: గిరిధర్ రెడ్డి
13. మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్: జనక్ ప్రసాద్
14. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్: విజయబాబు
15. హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: నాయుడు సత్యనారాయణ
16. మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: ఈరవత్రి అనీల్
17. ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్: నిర్మల జగ్గారెడ్డి
18. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్: అనిత ప్రకాశ్ రెడ్డి
19. స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: మన్నె సతీష్ కుమార్
20. అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కో-ఆపరేషన్: చల్లా నరసింహారెడ్డి
21. శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ: నరేంద్రరెడ్డి
22. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ: వెంకట్రామి రెడ్డి
23. రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: రాంరెడ్డి మల్‌రెడ్డి
24. టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పటేల్ రమేష్ రెడ్డి
25. తెలంగాణ ఫుడ్స్: ఎంఏ ఫహీం
Also Read : ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు ప్రశాంతంగా ఉన్నా- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
26. వుమన్ కోపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: బండ్రు శోభారాణి
27. వికలాంగుల కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: ఎం. వీరయ్య
28. స్పోర్ట్స్ అథారిటీ: కె. శివసేనరెడ్డి
29. సంగీత నాటక అకాడమీ: అలేఖ్య పుంజాల
30. షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: ఎన్. ప్రీతమ్
Also Read : మధుయాష్కీ గౌడ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా వ్యూహం ఉందా?
31. బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్: నూతి శ్రీకాంత్
32. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: బెల్లయ్య నాయక్
33. గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: కొట్నాక తిరుపతి
34. మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: జెరిపేటి జైపాల్
35. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మెన్: ఎంఏ జబ్బర్