20ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు చేశా, ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు ప్రశాంతంగా ఉన్నా- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

నా కూతురికి పెళ్లి చెయ్యాలి, కొడుకు బిజినెస్ పెడతా డబ్బులు కావాలంటున్నాడు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుందని ఆయన వాపోయారు.

20ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు చేశా, ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు ప్రశాంతంగా ఉన్నా- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Jagga Reddy సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని ఆయన అన్నారు. మనస్ఫూర్తిగా చెబుతున్నా.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో నేను రిలాక్స్ అవుతున్నా అని ఆయన చెప్పారు. నేను ఓడిపోయాను అని నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా ఫీల్ కావొద్దని జగ్గారెడ్డి కోరారు. మన ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి పనులు చేసుకుందాం అని చెప్పారు.

సంగారెడ్డి ప్రజల కోసం మనం జవాబుదారీగా ఉండాలని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి ప్రజల కోసం రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోని రాంనగర్ లో తన ఇంటి వద్ద అందుబాటులో ఉంటానని జగ్గారెడ్డి తెలిపారు. కార్యకర్తలు ఎవరూ గాంధీభవన్ కి రావొద్దని సూచించారు. మీరు గాంధీభవన్ వస్తే నేను కలవలేను, మాట్లాడలేను అని చెప్పారు. నా కూతురికి పెళ్లి చెయ్యాలి, కొడుకు బిజినెస్ పెడతా డబ్బులు కావాలంటున్నాడు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుందని ఆయన వాపోయారు. 20 ఏళ్లలో సంగారెడ్డిలో బోనాలు, దసరా ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశాను అని జగ్గారెడ్డి తెలిపారు.

Also Read : ఏపీ, తెలంగాణ మధ్య విభజన పంచాయితీ తేలేనా? ఇన్నాళ్లు ఏం జరిగిందో తెలుసా?