Prabhas Busy with Raja Saab Shooting after Kalki Movie Success
Prabhas Raja Saab : ప్రభాస్ కల్కి సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టి దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసాడు. కల్కి లాంటి భారీ హిట్ తో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. థియేటర్స్ లో ఇంకా కల్కి సినిమా హవా నడుస్తుంది. అయితే ప్రభాస్ చేతిలో దాదాపు ఇంకో అరడజను సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. కల్కి తర్వాత ఏ సినిమాతో ప్రభాస్ ఎప్పుడు వస్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే థియేటర్స్ లో కల్కి సినిమా హవా నడుస్తుండగానే ప్రభాస్ ‘రాజా సాబ్’ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. నేటి నుంచి మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ రాజా సాబ్ సినిమా హైదరాబాద్ శివార్లలో ఉన్న శంషాబాద్ లో షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఇంత పెద్ద హిట్ కల్కి ఇచ్చినా అది ఫుల్ గా ఎంజాయ్ చేయకుండానే మళ్ళీ వెంటనే షూటింగ్ లో మునిగిపోయాడు ప్రభాస్ అని అభిమానులు మెచ్చుకుంటున్నారు.
Also Read : Sai Pallavi : ఇక నుంచి డాక్టర్ సాయి పల్లవి.. MBBS పట్టా పుచ్చుకున్న సాయి పల్లవి..
ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ యూనిట్. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా హారర్ కామెడీ సినిమా అని తెలుస్తుంది. ఇప్పటివరకు దాదాపు 30 శాతం షూటింగ్ అవ్వగా రెండు నెలల్లో మొత్తం షూటింగ్ మారుతి పూర్తి చేసేస్తారని తెలుస్తుంది.