Ongole : నేడు ఒంగోలులో వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత కార్యక్రమం

నేడు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం వైఎస్‌ జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

YSR asara program : నేడు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం వైఎస్‌ జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు అధికారులు, పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేశారు. వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడతలో మొత్తం 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87, 74 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరేలా రూ.6,792 కోట్లు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో సిఎం జగన్ జమ చేయనున్నారు.

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం రెండో విడత మొత్తాన్ని ప్రభుత్వం నేడు డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరుతో ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేసే ఈ పథకానికి సీఎం జగన్‌ గత ఏడాది శ్రీకారం చుట్టి.. తొలి విడత సొమ్ము జమ చేసిన విషయం తెలిసిందే.

YSR Asara : ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

దాదాపు 20 వేల మంది లబ్ధిదారుల సమక్షంలో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గత ఏడాది తొలి విడతగా చెల్లించిన రూ.6,318.76 కోట్లు కూడా కలిపితే పొదుపు సంఘాల అప్పుకు సంబంధించి రూ.12,758.28 కోట్లు మహిళలకు అందజేసినట్లవుతుంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ పథకం ద్వారా ఇచ్చే డబ్బులను మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు