Pawan Kalyan : రాజకీయాల్లో పవన్ కొత్త ప్రయోగం.. మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు..

తాజాగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రయోగం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ముందు నుంచి అంచనాలు చాలానే ఉన్నాయి. రాజకీయాల్లోకి వస్తే కొత్త మార్పు తీసుకొస్తారని, మంచి చేస్తారని అందరూ భావించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాద్యతలు చేపట్టి పనులు మొదలుపెట్టేసారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు, ఫోన్లలో మాట్లాడి ఆ సమస్యలను త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. ఎంతోమంది ఆయన్ని కలవడానికి, వారి సమస్యలు చెప్పడానికి వస్తున్నారు. దీంతో అందరికి పవన్ కళ్యాణ్ అంటే మరింత గౌరవం ఏర్పడుతుంది. ఏదో మంచి చేస్తాడు, మార్పు తెస్తాడు అనే నమ్మకం కుదిరింది. తాజాగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రయోగం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Also Read : Varahi Ammavaru : పవన్ వారాహి అమ్మవారి దీక్ష.. ఈ దీక్ష ఏంటి? ఎందుకు చేస్తారు? వారాహి అమ్మవారు ఎవరు?

జనసేన అధికార సోషల్ మీడియా పేజీలలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు మంత్రుల కింద పంచాయితీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ & టెక్నాలజీ, పౌర సరఫరాల శాఖ, టూరిజం & సినిమాటోగ్రఫీ శాఖలు ఉన్నాయి. అయితే తాజాగా జనసేన పార్టీ.. ఈ శాఖలకు సంబంధించి మీలో ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలరు అని చెప్పి ఓ గూగుల్ ఫామ్ లింక్, క్యూఆర్ కోడ్ ని ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్ లింక్, క్యూఆర్ కోడ్ ద్వారా జనసేన పార్టీ ఇచ్చిన ఫామ్ లో ఆ శాఖలకు సంబంధించి మన సూచనలు సలహాలు ఇవ్వమని తెలుపుతూ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గామారింది.

ఆ శాఖలకు సంబంధించి మనం ఎలాంటి సూచనలు, సలహాలు అయినా ఇవ్వొచ్చు. దీంతో ఈ ఆలోచనకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు ఇలా డిజిటల్ గా వారి శాఖలకు సంబంధించి సలహాలు సూచనలు తీసుకోలేదు అని, పవన్ కళ్యాణ్ నిజంగానే రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక యువత అంతా ఆన్లైన్ లో ఉంటారు, సోషల్ మీడియా వాడతారు కాబట్టి ఈ గూగుల్ ఫామ్ కచ్చితంగా ఫిల్ చేస్తే మన ఆలోచనలు కూడా వారికి తెలుస్తాయని, ఇలా ప్రజల ప్రభుత్వం అవుతుందని పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఇలా కొత్త ప్రయోగాలు మొదలుపెడుతూ, ప్రజల వద్దకు చేరువవుతున్నారు. ఇంకా రాబోయే ఐదేళ్లలో ఎలాంటి మార్పులు తెస్తారో అని ఎదురుచూస్తున్నారు ఏపీ ప్రజలు.

ట్రెండింగ్ వార్తలు