Tirumala Food Stalls : తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తొలగింపు.. భవిష్యత్ కార్యాచరణపై వ్యాపారుల చర్చ

తమను ఒక్కసారైనా సంప్రదించకుండా టీటీడీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించకుండా న్యాయం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన..

Tirumala Food Stalls : తిరుమలలో ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు తొలగించాలన్న టీటీడీ నిర్ణయాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. తమను ఒక్కసారైనా సంప్రదించకుండా టీటీడీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. తమతో ఒక్కసారి కూడా చెప్పకుండానే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తొలగించాలని నిర్ణయించడం సమంజసం కాదని తిరుమల ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మునిరెడ్డి అన్నారు.

TTD : తిరుమలలో ఎవ్వరికైనా స్వామి వారి అన్నప్రసాదమే.. ప్రైవేటు హోటల్స్ బంద్

ఈ మేరకు శనివారం తిరుమలలో 130 ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులతో మునిరెడ్డి సమావేశమయ్యారు. కొండపై ఉన్న ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తొలగించాలని టీటీడీ పాలక మండలిలో తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. తమ సమస్యలను తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదే విధంగా టీటీడీ ఛైర్మన్, ఈవోలను కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగిస్తే వచ్చే సమస్యలను వివరిస్తామన్నారు.

Food Stalls On Tirumala Hill

”ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించొద్దని టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవోలను కోరతాం. ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించకుండా న్యాయం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని కలుస్తాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయం” అని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యూనియన్ నాయకుడు మునిరెడ్డి చెప్పారు.

Tirumala Anna Satram

కాగా.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొండపై ఉన్న ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తొలగించి భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని, తిరుమలలో భోజనాన్ని భక్తులు డబ్బుతో కొనుగోలు చేయొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Tirumala : శ్రీవారి లడ్డూలో అనంత ‘పప్పుశనగ’.. రైతుల ఆనందం

ట్రెండింగ్ వార్తలు