Andhra pradesh : క్యాసినో స్టార్ కొడాలి నాని విశ్వరూపం అంటే అధికారులపై దాడులు చేయించటమా :నారా లోకేశ్

మంత్రి పదవి పోగొట్టుకున్న క్యాసినో స్టార్ కొడాలి నాని విశ్వరూపం అంటే అధికారులపై దాడులు చేయించటమా అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

gudivada garvel mafia attemptto murder revenue inspector : కృష్ణా జిల్లా గుడివాడ‌లోని మోటూరు మట్టి మాఫియా ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై నారా లోకేశ్ మండిపడ్డారు. అధికార పక్ష నేతలు బరితెగించి అధికారులపై దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి పదవి కోల్పోయిన క్యాసినో స్టార్ కొడాలి నాని అనుచరులే ఆర్ఐ అరవింద్ పై దాడులు చేయించారంటూ నారా లోకేశ్ ఆరోపించారు. ఆర్ఐ అరవింద్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు గంట సురేష్ తమ్ముమడు గంట కళ్యాణ్ ఆర్ఐపై దాడికి పాల్పడినట్లుగా గుర్తించారు.

ఈ ఘటనపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. కొడాలి నాని అండతోనే మట్టి మాఫియా రెచ్చిపోతోందని విధుల్లో ఉన్న అధికారులపై కూడా దాడులు చేయించేంతగా అధికార పార్టీ నేతలు బరి తెగించారంటూ విమర్శించారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు దాడులకు దిగుతుంటే అడ్డుకున్న అధికారులను అంతుచూస్తాం అన్నంతగా రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొడాలి నాని నా విశ్వ రూపం చూపిస్తానంటూ ప్రగల్బాలు పలికారని..విశ్వరూపం చూపించటం అంటే ప్రభుత్వ అధికారులపై దాడులు చేయించటమేనా? మంత్రి పదవి కోల్పోయిన క్యాసినో స్టార్ ఇటువంటి మాఫియాలతో బరి తెగించి వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు నారా లోకేశ్. సీఎం ప్రోత్సాహంతోనే మట్టి మాఫియా, గడ్డం గ్యాంగ్ రెచ్చిపోతోందంటూ విమర్శలు సంధించారు.

గుడివాడ‌లో జోరుగా సాగుతున్న అక్ర‌మ మ‌ట్టి త‌ర‌లింపులు జరుగుతున్నాయంటూ అందిన సమాచారంతో ఆర్ఐ అరవింద్ ఘటనాస్థలానికి వెళ్లారు. అడ్డుకునేందుకు సిబ్బందితో క‌లిసి వెళ్లిన ఆర్ఐ అర‌వింద్‌ ను జేసీబీతో నెట్టి ఆర్ఐని హ‌త్య చేసేందుకు మాఫియా య‌త్నించింది. కానీ అరవింద్ త్రుటిలో త‌ప్పించుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.
కృష్ణా జిల్లా గుడివాడ‌లో మ‌ట్టిని అక్ర‌మంగా త‌ర‌లించే మాఫియా దారుణానికి తెగ‌బ‌డింది. మ‌ట్టి త‌ర‌లింపును అడ్డుకునేందుకు య‌త్నించిన రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌ను ఏకంగా జేసీబీతో కొట్టి హ‌త్య చేసేందుకు య‌త్నించింది. గురువారం రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఆర్ఐపై దాడికి య‌త్నించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. గుడివాడ ప‌రిధిలో గ‌త కొంత‌కాలంగా అధికార పార్టీ నేతల అండతో మ‌ట్టి అక్ర‌మ త‌ర‌లింపు భారీగా జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై స‌మాచారం అందుకున్న ఆర్ఐ అర‌వింద్ ఈ దందాను అడ్డుకునేందుకు త‌న సిబ్బందితో క‌లిసి వెళ్లారు. అర‌వింద్ య‌త్నాల‌ను అడ్డుకున్న మ‌ట్టి మాఫియా ఆయ‌న‌పై దాడికి దిగింది.

ఈ క్ర‌మంలో జేసీబీతో నెట్టి ఆయ‌నను హ‌త్య చేసేందుకు మాఫియా య‌త్నించింది. అయితే జేసీబీ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకున్న అర‌వింద్ తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అర‌వింద్‌కు అండ‌గా నిలిచాయి. అర‌వింద్‌ను హ‌త్య చేసేందుకు య‌త్నించిన వారిని అరెస్ట్ చేయ‌డంతో పాటు వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంఘం నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు