తిరుమలలోని పలు ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్

డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీలు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలులేని..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ జరిగిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండడంతో తిరుమలలో గొడవలు జరగకుండా ప్రతి ఇంటిని తనిఖీలు చేశారు.

టూ టౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలోతిరుమల బాలాజీ నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తిరుమలలో ప్రశాంత వాతావరణం ఉండాలని పోలీసులు ప్రజలకు చెప్పారు. ఎటువంటి రికార్డులులేని 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గూడూరు ఆరో వార్డు పరిధిలోనూ పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు.

డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీలు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో వరసుగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఓట్ల లెక్కింపునకు మరో 10 రోజుల సమయమే ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ సమయంలో జరిగిన ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని భావిస్తున్నారు.

Also Read: తెలంగాణలో ఎక్కడాలేని ఫ్యాక్షన్ సంస్కృతి ఇక్కడ నెలకొంది: కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు