అసత్య ప్రచారాలకు కొడాలి నాని చెక్.. ఇదిగో వీడియో

కొడాలి నాని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు ఈ మధ్య కాలంలో ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ సందర్భాల్లో దీనికి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

Kodali Nani : అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వార్తలకు కొడాలి నాని చెక్ పెట్టారు. సోఫాలో తాపీగా కూర్చున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారాయన. వైసీపీ నేతలతో మాట్లాడుతూ నాని సోఫాలో కుప్పకూలిపోయారనే ప్రచారం జరిగింది. ఆయనను ఆసుపత్రికి తరలించారనే వార్తలూ వచ్చాయి. అసత్య ప్రచారాలకు చెక్ పెడుతూ ఒక వీడియోని విడుదల చేశారు కొడాలి నాని.

మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, ఆసుపత్రిలో జాయిన్ చేశారనే ప్రచారం జరిగింది. దీనిపై కొడాలి నాని స్పందించారు. ఓ వీడియోను ఆయన సోషల్ మీడియలో షేర్ చేశారు. తాను సోఫాలో కూర్చుని వైసీపీ నేతలతో ఫోన్ మాట్లాడుతున్న వీడియోని కొడాలి నాని విడుదల చేశారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని కొడాలి నాని స్పష్టం చేశారు.

కొడాలి నాని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు ఈ మధ్య కాలంలో ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ సందర్భాల్లో దీనికి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. తాను పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో ఉన్నానని పలు మార్లు వెల్లడించారు. తాజాగా మరోసారి కొడాలి నాని తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారని, కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోయారని, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. దీంతో కొడాలి నాని స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలుపుతూ ఆయన ఎక్స్ లో వీడియోతో పాటు అనేక అంశాల పోస్ట్ చేశారు.

Also Read : ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న విజువల్స్ ట్వీట్ చేసిన సజ్జల

ట్రెండింగ్ వార్తలు