టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Buddha Venkanna: పోరాటం చేయని వాళ్లు, బ్లాక్ మెయిలింగ్ చేసి టిక్కెట్లు తెచ్చుకున్నారని అన్నారు.

Buddha Venkanna: టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్‌ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని అన్నారు. ఇది తన డిమాండ్ అని చెప్పారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ… ఆ డిమాండ్ చేసే హక్కు తనకుందని అన్నారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే నారా లోకేశ్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్దా వెంకన్న అన్నారు. లోకేశ్‌ని టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని చెప్పారు.

అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాగా పనిచేశారని బుద్దా వెంకన్న అన్నారు. ఆయనకు మంత్రి వర్గంలో కీలక శాఖ కేటాయించాలని చంద్రబాబుని కోరుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడి ఆత్మకథలో తనకో పేజీ ఉంటుందని తెలిపారు.

గతంలో టీడీపీ ఓడిపోయాక చాలామంది పార్టీని వదిలి పారిపోయినప్పటికీ తాను మాత్రం నిలబడ్డానని చెప్పారు. పోరాటం చేయని వాళ్లు, బ్లాక్ మెయిలింగ్ చేసి టిక్కెట్లు తెచ్చుకున్నారని అన్నారు. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏం చేసినా తప్పులేదని అన్నారు. రెడ్ బుక్‌లో పిన్నెల్లి పేరుందని చెప్పారు.

చంద్రబాబు నాయుడికి చురకలు అంటించిన విజయసాయిరెడ్డి

ట్రెండింగ్ వార్తలు