చంద్రబాబు నాయుడికి చురకలు అంటించిన విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy: ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నారో ఈపాటికి చంద్రబాబు నాయుడికి అర్థమై ఉంటుందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడికి చురకలు అంటించిన విజయసాయిరెడ్డి

YCP MP Vijayasai Reddy

Updated On : May 24, 2024 / 11:32 AM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో 10 రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి దీనిపై స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆయన చురకలు అంటించారు.

చంద్రబాబు నాయుడు పోయినసారి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నారని విజయసాయిరెడ్డి అన్నారు. అనంతరం జరిగిన 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) టీడీపీకి వచ్చింది 23 స్థానాలేనని తెలిపారు. ఈ సారి తమ నలుగురు ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) నేతలను కొన్నారని చెప్పారు.

జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నదని గుర్తు చేశారు. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నారో ఈపాటికి చంద్రబాబు నాయుడికి అర్థమై ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ లెక్కన చంద్రబాబు నాయుడు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నారని తెలిసి… ఆయన మీద జాలేస్తోందని అన్నారు.

కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఈ నెల 25న ఆరో దశ ఎన్నికలు, జూన్ 1న ఏడో దశ ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతాయి.

Also Read: అంతన్నది.. ఇంతన్నది.. అది నేను కాదన్నది.. చివరికి అడ్డంగా దొరికిపోయిన నటి హేమ