King Cobra: అనకాపల్లిలో 15 అడుగుల కింగ్ కోబ్రా .. పరుగులు పెట్టిన స్థానికులు.. అటవీ అధికారులు ఏం చేశారంటే..

ఇలాంటి పాములు కేరళ, ఆ సమీప ప్రాంతాల్లో ఎక్కువ సంచరిస్తుంటాయి. ఇవి అధికంగా దట్టమైన అడవుల్లో మాత్రమే ఉంటాయి. జనావాసాల్లోకి రావడం చాలా అరుదు.

King Cobra

Anakapalle District : కొద్దిపాటి పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అదే పదిహేను అడుగుల కింగ్ కోబ్రా కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. దరిదాపుల్లోకూడా ఉండం. ఇలాంటి ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భారీ కింగ్ కోబ్రాను చూసిన స్థానిక ప్రజలు భయంతో అక్కడి నుంచి పరుగు పెట్టారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వారు రంగంలోకి దిగి భారీ కింగ్ కోబ్రాను తమదైన శైలిలో బస్తాలోకి పంపించారు. ఆ తరువాత దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గతంలో ఎప్పుడూలేని విధంగా భారీ కింగ్ కోబ్రా కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి పాములు ఇంకేమైనా ఉన్నాయా? అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది.

Viral Video: అంతర్జాతీయ రేసులో ఎవరైనా ఇంత మెల్లిగా ఉరుకుతారా? ప్రేక్షకుల దిమ్మతిరిగిపోయింది..

అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలం ముకుందపురం సమీపంలో భారీ కింగ్ కోబ్రా కనిపించింది. గ్రామ సమీపంలోని పొలంలో రైతులు పనులు చేస్తుండగా శబ్దం వినిపించింది. ఏమిటాఅని చూడగా.. భారీ కింగ్ కోబ్రాగా గుర్తించారు. పొలంలో పనిచేస్తున్నవారంతా భయంతో పరుగుపెట్టారు. ఆ తరువాత విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అటవీశాఖ అధికారులు కింగ్ కోబ్రా ఉన్న ప్రదేశానికి చేరుకొని తమదైన శైలిలో పామును బస్తాలోకి పంపించారు. ఆ తరువాత దానిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు. అయితే, ఈ పాము బరువు దాదాపు 13కిలోలు ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద కింగ్ కోబ్రా చూడండం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్పారు.

woman viral video : చీరకట్టుతో రోమ్ వీధుల్లో తిరిగిన భారతీయ మహిళ.. మంత్రముగ్ధులైన ఇటాలియన్లు

భారీగా ఉన్న కింగ్ కోబ్రాను అటవీ అధికారులు పట్టుకోవటంతో స్థానిక రైతులు ఊపిరిపీల్చుకున్నాయి. అనకాపల్లి ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇటీవలకాలంలో సమీపంలోని కొండలను ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాడుగుల, దేవరపల్లి, చీడికాడ మండలాల్లో ఇలాంటి పాములు ప్రత్యక్షమవుతున్నాయి. ఇలాంటి పాములు కేరళ, ఆ సమీప ప్రాంతాల్లో ఎక్కువ సంచరిస్తుంటాయి. ఇవి అధికంగా దట్టమైన అడవుల్లో మాత్రమే ఉంటాయి. జనావాసాల్లోకి రావడం చాలా అరుదు. అయితే, ఇటీవల ఏపీలో దర్శనమిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు