మైహోమ్ గ్రూప్ నుంచి వస్తున్న మరో లాండ్ మార్క్ ప్రాజెక్ట్ అక్రిద.. సూపర్ కనెక్టివిటీ, అఫర్డబుల్ ప్రైస్.. ఇంకా మరెన్నో

సూపర్ కనెక్టివిటీ, అఫర్డబుల్ ప్రైస్, వరల్డ్ క్లాస్ ఎమినిటీస్ తో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి మైహోమ్ అక్రిద.. బెస్ట్ చాయిస్.

అక్రిద.. మైహోమ్ గ్రూప్ నుంచి వస్తున్న మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్. సూపర్ కనెక్టివిటీ, అఫర్డబుల్ ప్రైస్, వరల్డ్ క్లాస్ ఎమినిటీస్ తో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి అక్రిద.. బెస్ట్ చాయిస్. 3 దశాబ్దాలకు పైగా హైదరాబాద్ మహానగరంలో ఎన్నో లాండ్ మార్క్స్ క్రియట్ చేసిన మైహోమ్ గ్రూప్ నుంచి వస్తున్న మరో లాండ్ మార్క్ ప్రాజెక్ట్ అక్రిద. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో నవంబర్ వన్ సంస్థగా పేరుగాంచిన మైహోమ్ గ్రూప్ 24 రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. 50 వేలకుపైగా ప్రజల సొంతింటి కలను సాకారం చేసింది. మరిన్ని కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది మైహోమ్ గ్రూప్.

మైహోమ్ గ్రూప్.. మరో బడా ప్రాజెక్ట్‌తో వస్తోంది. హైదరాబాద్‌లో మరో టాలెస్ట్ టవర్‌ అక్రిద పేరుతో ప్రజలను పులకింపజేయనుంది. ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్ని అనుమతులతో పనులు కూడా ప్రారంభించింది. దేశంలోనే క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన మైహోమ్ సంస్థ ఎన్నో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా కంప్లీట్ చేసింది. 50 వేలకుపైగా ప్రజల సొంతింటి కలను సాకారం చేసింది. ఇప్పుడు మరికొందరి సొంతింటి డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసేందుకు మైహోమ్ అక్రిద పేరుతో ముందుకు వచ్చింది. గతంలో మైహోమ్ గ్రూప్ పూర్తి చేసిన ప్రాజెక్టులు ఓసారి చూద్దాం.

అందరూ మెచ్చేలా ప్రాజెక్టులు
అటు రెసిడెన్షియల్.. ఇటు కమర్షియల్ ప్రాజెక్టులతో హైదరాబాద్‌లో నగర నిర్మాణాభివృద్ధికి, రియల్ ఎస్టేట్ పురోగతికి తోడ్పడుతోంది మైహోమ్. ఇప్పటివరకు 24 రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి.. 33 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలను పూర్తి చేసిన సంస్థ హైదరాబాద్‌లో ఏదైనా ఉందంటే అది ఒక్క మైహోమ్ గ్రూప్ మాత్రమే. అంతేకాదు.. ప్రస్తుతం నిర్మాణంలో 40 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండగా.. మరో 10 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు ప్లానింగ్ దశలో ఉన్నాయి. ఈ అంకెలకంటే కూడా.. ఆరు ప్రధానమైన అంశాలను కస్టమర్లకు అందించాలనేది మైహోమ్ గ్రూప్ లక్ష్యం. సంతోషకరమైన కమ్యూనిటీలు, అత్యుత్తమ నివాసాలు, క్లియర్ డాక్యుమెంటేషన్, అనుకున్న సమయానికి కస్టమర్లకు అందించడం, అందరూ కోరుకునే ఆహ్లాదకరమైన గమ్యస్థానం, భద్రతతో కూడిన పర్యావరణం ఇలా అందరూ మెచ్చేలా ప్రాజెక్టులను నిర్మించేందుకు నిరంతరం శ్రమిస్తుంటుంది మైహోమ్ గ్రూప్. అందుకే మైహోమ్ గ్రూప్ తెలివైన కస్టమర్ల ఫస్ట్ చాయిస్ అయ్యింది.

జెఎం అపార్ట్‌మెంట్స్‌తో ప్రస్థానం మొదలు
ఇప్పటివరకు మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్మించిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులు హైదరాబాద్‌, చుట్టుపక్కలలో ఎటుచూసినా కనిపిస్తుంటాయి. 1989లో మైహోమ్ జెఎం అపార్ట్‌మెంట్స్‌ ఈ ప్రస్థానం మొదలైంది. 1991లో మై హోమ్ మంజరి, 1993లో మైహోమ్ లక్ష్మీ నివాస్, 1994లో మైహోమ్ హిల్ వ్యూ, 1995లో మైహోమ్ గార్డెనియా, 1998లో మైహోమ్ ఫెర్న్ హిల్, 1998లో మైహోమ్ మధుబన్, 2002లో మైహోమ్ రెయిన్‌బో, 2005లో మైహోమ్ నవద్వీప, 2010లో మైహోమ్ జ్యువెల్, 2015లో మైహోమ్ అబ్ర, 2017లో మైహోమ్ విహంగ, 2020లో మైహోమ్ అవతార్, మైహోమ్ భూజ నిర్మాణం పూర్తి చేశారు. 2021లో మైహోమ్ క్రిషే, 2022లో మైహోమ్ అంకుర, మైహోమ్ మంగళ, మైహోమ్ త్రాక్ష్య, 2023లో మైహోమ్ త్రిదశ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇంకా.. మైహోమ్ రాకా, మైహోమ్ సయూక్, మైహోమ్ నిషాద, మైహోమ్ 99, మైహోమ్ అవలి, మైహోమ్ విపిన, మైహోమ్ అపస్ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.

కమర్షియల్ ప్రాజెక్టుల్లోనూ బ్రాండ్‌
రెసిడెన్షియల్ ప్రాజెక్టులే కాదు.. కమర్షియల్ ప్రాజెక్టుల్లోనూ బ్రాండ్‌గా ఎదిగింది మైహోమ్ గ్రూప్. 1997లో మైహోమ్ జూపల్లితో మొదలై.. 1998లో మైహోమ్ సరోవర్, 2001లో మైహోమ్ టైకూన్, 2010లో మైహోమ్ హబ్, 2019లో ది స్కై వ్యూ, 2020లో ట్విట్జా కమర్షియల్ ప్రాజెక్టులున్నాయి. వీటితో పాటు మైహోమ్ గ్రవ, నార్సింగిలో మరో కమర్షియల్ ప్రాజెక్టును చేపట్టింది మైహోమ్ గ్రూప్ . ఇవన్నీ కూడా హైదరాబాద్‌కు ల్యాండ్ మార్కులుగా మారాయి.

కోకాపేటలో కొత్త కమర్షియల్ ప్రాజెక్ట్
మైహోమ్ సంస్థ ఇప్పటివరకు నిర్మించిన 24కు పైగా ప్రాజెక్టులు ఒక ఎత్తయితే.. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన కోకాపేటలో నిర్మిస్తున్న కొత్త కమర్షియల్ ప్రాజెక్ట్.. ఇటు మైహోమ్ గ్రూప్‌కే కాకుండా.. హైదరాబాద్ నగరానికే మరో మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ కానుంది. మొత్తం 75 ఎకరాల్లో.. 4 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కానున్న ఈ కమర్షియల్ ప్రాజెక్టు.. ఆసియా ఖండంలోనే ఒక అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కమర్షియల్ ప్రాజెక్ట్ కానుంది. కోకాపేట ఇంటిగ్రేటెడ్ కమర్షియల్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు కానున్న కార్యాలయాల వసతులు, ఇతర సదుపాయాలు ప్రపంచస్థాయిలో అత్యాధునికంగా ఉంటాయి. మైహోమ్ గ్రూప్‌నకు, హైదరాబాద్ నగరానికి.. ఒక మకుటాయమానంగా నిలువనున్న ఈ కమర్షియల్ ప్రాజెక్టు.. వచ్చే ఏడెనిమిది సంవత్సరాల్లో సిద్ధంకానుంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతి గాంచిన ఆర్కిటెక్ట్ సంస్థలు ఈ ప్రాజెక్టు రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. కమర్షియల్‌గా నిర్మించే ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్‌కు ల్యాండ్ మార్క్‌గా, ఐకానిక్ కన్‌స్ట్రక్షన్స్ చేసిన మైహోమ్ గ్రూప్ మిడిల్ క్లాస్ వారి సొంతింటి కలను నిజం చేయడంతో పాటు.. ఆ కుటుంబాల్లో సంతోషపు వెలుగులు నింపుతోంది.

మైహోమ్‌ గ్రూప్‌ అద్భుత నిర్మాణం శ్రీరామ నగరం
మైహోమ్‌ గ్రూప్‌ నిర్మాణ అద్భుతాల్లో.. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ వద్ద శ్రీరామ నగర నిర్మాణం కూడా ఒకటి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి మంగళశాసనాలతో 216 అడుగుల భారీ రామానుజాచార్యుల సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలు అందరినీ అబ్బురపరుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా ఎదుగుతోంది ముచ్చింతల్‌ శ్రీరామ నగరం.

Read Also : భళా మైహోమ్ అక్రిద.. భాగ్యనగరి సిగలో మరో మణిహారం..!

నాలుగు దశాబ్దాల తర్వాత భవిష్యత్‌ను ముందే ఊహిస్తూ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు వేసిన అడుగులు ఇవాళ మైహోమ్ గ్రూప్ సంస్థను అత్యున్నతంగా తీర్చిదిద్దాయి. 15 వేల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ఇది కేవలం.. మైహోమ్ గ్రూప్ సంస్థల ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సక్సెస్ మాత్రమే కాదు.. హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి.. మైహోమ్ గ్రూప్ వేసిన బీజాలు ఇప్పుడు వృక్షాలై.. అద్భుతమైన ఫలాలనందిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు