ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీ మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. అంతేకాదు.. డప్పు వాయించారు.

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీ మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. అంతేకాదు.. డప్పు వాయించారు. గిరిజన సంప్రదాయం కొమ్మకోయ దరించారు. ఆదివాసీ ప్రజలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Also Read : Gold Price Today : బంగారం కొనేవాళ్లకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ కొంటున్నారా? అయితే..

సీఎం హోదాలో చంద్రబాబు నిత్యం బిజీబిజీగా ఉంటూ అభివృద్ధి పనుల నిమిత్తం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడం చూస్తుంటాం. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరైనా.. షెడ్యూల్ ప్రకారం తన పని పూర్తిచేసుకొని వెళ్లిపోతుంటారు. అయితే, నాల్గోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన వ్యవహారశైలిలోమార్పు కనిపిస్తోందన్న చర్చ జరుగుతుంది. ఆయన వ్యవహరించే తీరు ఒక సామాన్యుడిని తలపిస్తోంది. ఎక్కడి వెళ్లినా చంద్రబాబు తన వ్యవహార శైలితో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. తాజాగా.. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు ఆదివాసీ మహిళలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీ మహిళలతో కలిసి చంద్రబాబు సంప్రదాయ నృత్యం చేశారు. డప్పు వాయించారు. ఆదివాసీ ప్రజలో సరదాగా ముచ్చటించారు.

అరకు కాపీ ఉత్పత్తులను చంద్రబాబు పరిశీలించారు. చంద్రబాబుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు అరకు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆదివాసీ జీవనశైలికి సంబంధించిన పనిముట్లను ఆసక్తిగా తిలకించారు. గిరిజనుల తేనెను చంద్రబాబు కొనుగోలు చేశారు.