నోట్ల కట్టల గుట్ట.. ఎంత వెనకేశాడో తెలుసా? అధికారి ఇంట్లో గుర్తించిన ఏసీబీ

ACB Raids on Municipal Revenue Officer House

అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది తెలంగాణ ఏసీబీ. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సూపరింటెండెంట్, రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

ఏసీబీ సోదాల్లో 2 కోట్ల 93 లక్షల 81 వేల రూపాయలు పట్టుబడ్డాయి. నరేందర్ బ్యాంకు ఖాతాల్లో కోటి 10 లక్షల బ్యాలెన్స్ గుర్తించారు. అర కిలో బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆస్తుల విలువ 6 కోట్ల 7 లక్షల రూపాయల విలువ ఉంటుంది.

ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్ పై కేసు నమోదు చేశారు. అధికారిగా ఉన్న సమయంలో భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించాడు నరేందర్. మున్సిపల్ పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్లు, ఆదాయ పన్ను సంబంధించి భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: హైదరాబాద్‌కు అమెరికా బయోఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆమ్‌జెన్: గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు