హైదరాబాద్‌కు అమెరికా బయోఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆమ్‌జెన్: గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి

. దీంతో మూడు వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. కొత్తగా..

హైదరాబాద్‌కు అమెరికా బయోఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆమ్‌జెన్: గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి

అమెరికా బయోఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆమ్‌జెన్.. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరుపుతున్న రేవంత్ తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తుండడంపై మాట్లాడారు.

ఈ ఏడాది చివరలో హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో మూడు వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించెందుకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.

హైటెక్ సిటీలో ఆమ్‌జెన్ రీసెర్చ్ సెంటర్ క్యాంపస్ ఉంటుందన్నారు. ప్రపంచంలో పేరొందిన బయోటెక్‌ సంస్థ హైదరాబాద్‌ ఎంచుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత పెరుగుతోందని చెప్పారు. ప్రపంచ స్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. 40 సంవత్సరాలుగా బయో టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఆమ్‌జెన్ ఉందని చెప్పారు.

Also Read: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పీర్జాదిగూడ మేయర్ పీఠం కాంగ్రెస్ హస్తగతం