Pawan kalyan : పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో జగన్‌లో డిప్రషన్, అది ఆయన మాటల్లోనే తెలుస్తోంది : గాదె వెంకటేశ్వరరావు

మీలాగా మేము కూడా ప్రవర్తిస్తే మీరు తట్టుకో లేరు. పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రతో జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.పవన్ దొర, మీ మాదిరి దొంగ కాదు..అందుకే మీసాలు మెలేస్తాడు.

Pawan kalyan Varahi Yatra

Pawan kalyan Varahi Yatra : అమ్మఒడి కార్యక్రమంలో జగన్ మాట్లాడిన తీరు చాలా డిప్రషన్ లో ఉన్నట్లు కనబడింది..సీఎం జగన్ బటన్ నొక్కుడుతో రాష్ట్ర‌ సమస్యలు తీరిపోయాయని చెబుతున్నారు అంటూ జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. పవన్ కు నలుగురు భార్యలు అంటూ జగన్ అన్నారు. మరి పవన్ కున్న ఆ నాలుగవ భార్య ఎవరు? అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ కు ధీటుగా సమాధానం చెప్పే నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమేనన్నారు. మీలాగా మేము కూడా వ్యాఖ్యానించినా..ప్రవర్తిస్తే మీరు తట్టుకో లేరు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రతో జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

Pawan Kalyan : తెలుగు స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరం- పవన్ కల్యాణ్

అవినీతి పునాదులతో ఏర్పడిన పార్టీ వైసీపీ పార్టీకి జనసేన త్వరలోనే పీఠం కదిలించి ఇంటికి పంపుతుందన్నారు.పవన్ దొర, మీ మాదిరి దొంగ కాదు..అందుకే మీసాలు మెలేస్తాడు అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ ప్రజల్లో కులాల చిచ్చు పెడుతున్నారని తద్వారా లాభపడాలనుకుంటున్నారని ఆరోపించారు. కానీ ప్రజలకు మీ కుటిల రాజకీయాలు అర్థమయ్యాయి. ఇక మీ ఆటలు చెల్లవన్నారు. కులాల వారిగా ప్రజలను విడగొట్టేలా చేసే జగన్ యత్నాలు సాగవన్నారు.

విద్యా దీవెనకు అంబేడ్కర్‌ పేరు తొలగించిన వ్యక్తి జగన్..ఆయన పేరే పెట్టుకున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని ఎన్నికల్లో ఓట్ల రూపంలో సరైన సమాధానం చెబుతారని అన్నారు.జనంకోసం పుట్టిన పార్టీ జనసేన..పదిరోజులు పవన్ పర్యటిస్తే జగన్ కు తడిసిపోతుంది అంటూ ఎద్దేవా చేశారు.ఆర్టీఏలో స్మార్ట్ కార్డు ఇవ్వలేదని…కార్డ్ పేరుతో వినియోగదారుడు నుంచి రూ.260 వసూలు చేశారు అంటూ ఆరోపించారు.ఆర్టీఏ లో తీవ్ర అవినీతి జరుగుతోందంటూ ఆరోపించారు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు.

Pawan Kalyan: సీఎం మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నేను చెప్పును ఊరికే చూపించలేదు: పవన్ కల్యాణ్

 

ట్రెండింగ్ వార్తలు