Pawan Kalyan : కోనసీమ ‘క్రాప్ హాలిడే’ పాపం వైసీపీ ప్రభుత్వానిదే : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బంగారు పంటలు పండించే కోనసీమ రైతులు ఇప్పుడు ‘క్రాప్ హాలిడే’ప్రకటించిన పాపం అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. అన్నపూర్ణగా పేరున్న గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు తీసుకొచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

Konaseema Farmers Crop Holiday : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బంగారు పంటలు పండించే కోనసీమ రైతులు ఇప్పుడు ‘క్రాప్ హాలిడే’ప్రకటించిన పాపం అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. అన్నపూర్ణగా పేరున్న గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు తీసుకొచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరించిన తీవ్ర నిర్లక్ష్యం వల్లనే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని..ఇది వైసీపీ ప్రభుత్వం చేతకానితనానికి నిలువెత్తు నిదర్శం అని అన్నారు.

ఆరుగాలం కష్టపడి రైతన్నలు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రావటంలేదని..కొనుగోలు చేసినా..గిట్టుబాటు ధర లేక ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురించేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే..మరో పంట వేయటానికి రైతులకు పెట్టుబడి ఎక్కడనుంచి వస్తుంది? ఈ కనీసం పరిజ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకపోవటం దౌర్భాగ్యం అని ఎద్దేవా చేశారు.

బంగారు పండే గోదావరి జిల్లాలోని కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించి 11 ఏళ్ల తరువా ఇటువంటి పరిస్థితులు రావటానికి కారణం వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లనేనని పవన్ కళ్యాణ్ అన్నారు. క్రాప్ హాలిడే చాలా బాధాకరం అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. కోనసీమ రైతులకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వర్షాలు కురిసే రోజులు దగ్గరపడుతున్నా..తొలకరి పంట వేయలేం అని ఆవేదన వ్యక్తంచేస్తు రైతులను తమకు లేఖలు రాస్తున్నారని..వారికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ట్రెండింగ్ వార్తలు