Minister Buggana : ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, రాబడులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు.

Minister Buggana Rajendranath Reddy : ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, రాబడులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ…సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామన్నారు.

ఏపీ సర్కార్‌ పరిమితికి లోబడే అప్పులు చేస్తోందన్నారు ఆర్థికమంత్రి బుగ్గన. అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయని అన్నారు. అదే క్రమంలో ఏపీ కూడా అప్పు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లక్షా 27 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని స్పష్టం చేశారు.

కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ 7 వేల 130 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఏడాదిగా ట్యాక్స్‌ పెంపు లేక 7 వేల 94 కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. అయినా సరే..వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల ఖాతాల్లో లక్షా ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేశామన్నారు.

GSDPలో రెండు శాతం అప్పు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్న మంత్రి.. ఏపీ ఆర్థికపరిస్థితిపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే యత్నం చేశారు. విపక్షాల ఆరోపణలు అర్థరహితమన్నారు.

ట్రెండింగ్ వార్తలు